ఉబ్బస వ్యాధి - నివారణా యోగాలు .
* ఉత్తరేణి చెట్టు సమూలంగా తెచ్చి కాల్చి భస్మం చేసి జల్లెడ పట్టి నిలువ ఉంచుకుని పూటకు ఒక గ్రాము మోతాదు గా ఒక టీ స్పూన్ తేనే కలిపి రెండు పూసిటలా సేవిస్తూ ఉంటే కటిన ఉబ్బస రోగాలు తగ్గుతాయి .
* కుప్పింట చెట్టు సమూలంగా తీసి కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి ఆ చుర్ణానికి తేనే కలిపి దంచి ముద్దచేసి నిలువ చేసుకోవాలి . రోగబలాన్ని , రోగి బలాన్ని బట్టి , వయస్సుని బట్టి ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బసపు దగ్గు హరించును. ఇది నా అనుభవ పూర్వకం .
* గలిజేరు చెట్టు చెట్టు వ్రేళ్ళతో సహా తెచ్చి శుభ్రంగా కడిగి వ్రేళ్లు కత్తిరించి తీసి ఆవుపాలలొ ఉడకబెట్టి ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా బెల్లం , నెయ్యి కలిపి ఉదయం పూటనే తింటూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.
* రావి చెట్టు కాచే రావిపండ్లు తెచ్చి ముక్కలుగా కోసి ఎండబెట్టి దంచి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి నిలువ చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా రెండు పూటలా తేనేతో కాని పటికబెల్లం చూర్ణం తో కాని కలిపి తింటూ ఉంటే ఉబ్బస రోగం హరించును. ఇది స్త్రీలకు, సంతాన యోగం కూడా కలిగించ గలదు.
* ప్రతి రొజూ ప్రతి పూట భొజనం చేసే ముందు యాలుక ల చూర్ణం రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా మొదటి ముద్దతో కలుపుకుని తింటూ ఉండాలి.దీనితో పాటు ప్రతిరొజు రాత్రి నిద్ర పొయే ముందు 10 గ్రా శనగపప్పు తింటూ ఉండాలి. ఇలా నిత్యం చేస్తూ ఉంటే ఉబ్బసం వలన కలిగే బాదలు తొలగిపోతాయి.
* పసుపు కొమ్ములు దంచిన చూర్ణం ఒక గ్రాము నుండి రెండు గ్రాముల వరకు తమలపాకు లొ పెట్టుకుని తింటూ ఉంటే ఉపిరితిత్తులు బిగబట్టి శ్వాస కష్టంగా ఉండే సమస్య తొలగిపోవును.
* మారేడు ఆకులు, 10 గ్రా తీసుకుని 40 గ్రా మంచినీళ్ళలో వేసి 10 గ్రా కషాయం మిగిలేలా మరగబెట్టి వడపోసి చల్లార్చి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఉబ్బసం తగ్గును .
* శొంటి 20 గ్రా చూర్ణం లొ 300 గ్రా నీళ్లు పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి , 100 గ్రా మిగిలేంత వరకు కాచి దించుకొని వడకట్టాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే క్రమంగా ఉబ్బసం హరించి పొతుంది.
* జిల్లేడు చెట్టు మొగ్గలు 15 గ్రా , వాము 10 గ్రా , బెల్లం 15 గ్రా ఈ మూడు వస్తువులు కలిపి మెత్తగా మర్దించి 5 గ్రా బరువు ఉండేలా మాత్రలు తయారు చేసుకోవాలి . ప్రతిరొజు ఉదయం పూట మాత్రమే మంచినీళ్ళతో వేసుకోవాలి . ఈ విధంగా 40 దినాలు చేస్తే ఎంత కటినమైన ఉబ్బసం అయినా సమూలంగా నివారించ బడును.
* ఉల్లిపాయ రసం 50 గ్రా , వెల్లుల్లి రసం 50 గ్రా , అల్లం రసం 50 గ్రా , కలబంద రసం 50 గ్రా , పట్టు తేనే 50 గ్రా ఈ పదార్దాలు అన్ని గాజు సీసాలో పోసి మూతగట్టిగా పెట్టి మూడు రోజుల పాటు ఆ సీసాని భూమిలో పాతిపెట్టాలి.ఆ తరువాత దాన్ని బయటకి తీసి రోజు రెండు సార్లు 5 గ్రా మోతాదుగా లొపలికి తీసుకుంటూ ఉంటే మూడు వారాల్లో ఉబ్బసం వ్యాధి సమూలంగా అంతరించి పొతుంది.
* ఒక కప్పు టీ లొ ఒక నిమ్మ పండు రసం కలిపి తాగితే ఉబ్బసం వెంటనే శాంతించును. ఇది తాత్కాలికంగా పనిచేయును .
* నేలతాడి గడ్డల చూర్ణం 5 గ్రా , పటికబెల్లం చూర్ణం 5 గ్రా కలిపి ఒక మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.
* శారీరక శక్తిని బట్టి రోజు 5 నుండి 10 చుక్కల శుద్ధమైన వేప నూనెని తాంబూలం లొ వేసుకొని నమిలి మింగుతుంటే మూడు వారాలలో కటినమైన ఉబ్బస వ్యాధి హరించును.
* రోజు రెండు పూటలా భరించ గలిగినంత వేడి నీటిని ఒక పళ్ళెంలో పోసి ఉబ్బసం రోగి తన పాదాలని ఆ నీటిలో ఉంచడం వలన ఉబ్బసం శాంతిస్తుంది.ఇలా రెండు పూటలా చేస్తూ తగిన ఔషధాలు , ఆహర నియమాలు పాటిస్తే తొందరగా ఉబ్బస వ్యాధి నుంచి కోలుకొంటారు.
* చక్ర కేళి అరటి పండు ని ఆవుమూత్రం లొ మెత్తగా పిసికి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఆవుమూత్రం పతంజలి స్టోర్స్ లొ దొరుకును.
* ఉత్తరేణి గింజలు 5 గ్రా , మిరియాలు 10 గ్రా , ఈ రెండింటిని తుమ్మ చెట్టు జిగురు నీళ్లతో నూరి గురుగింజ అంత మాత్రలు చేసి పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూటలా మంచినీళ్ళు తో వేసుకోవాలి . ఈ విధంగా చేయడం వలన ఉబ్బసవ్యాది పూర్తిగా తగ్గిపోవును .
గమనిక -
పైన చెప్పిన నివారణా యోగాలలో మీకు సులభమైన వాటిని ఏదో ఒకటి ఎంచుకుని మీ వ్యాధిని తగ్గించుకోనగలరు. అదే విధంగా యే అయుర్వేద ఔషదం అయినా 41 రోజులు ( మండలం ) విడవకుండా వాడినప్పుడే తన ప్రభావాన్ని బలంగా చూపిస్తుంది. కొన్ని మూలికలు నేలతాడి ఇలాంటివి మీకు పచారి షాపుల్లో దొరుకుతాయి.
మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి