*ఉగాది 2026 – పరాభవ నామ సంవత్సరం*
అసలు అర్థం ఏమిటి ?
మార్చి 19న ఉగాది.
తెలుగు ప్రజలకు ఇది కొత్త సంవత్సరానికి ఆరంభం.
ఈసారి ప్రారంభమయ్యే సంవత్సరానికి పేరు.
*పరాభవ నామ సంవత్సరం*.
*పరాభవ* పదం యొక్క అసలు అర్థం సంస్కృతంలో “पराभव” (Parābhava) అనే పదానికి నిఘంటువుల్లో ఇచ్చిన అర్థాలు.
పరాజయం (defeat)
అవమానం (humiliation)
తగ్గుదల / క్షీణత (decline)
ఈ పదం “पराभू (parābhū)” అనే ధాతువు నుండి వచ్చింది.
దాని అర్థం ఓడిపోవడం / అధిగమించబడటం.
ప్రామాణిక సంస్కృత నిఘంటువులు కూడా ఇదే అర్థాన్ని ఇస్తాయి.
ఈ పేరు విన్న వెంటనే చాలా మంది ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు
పరాభవం అంటే ఓటమి, అవమానం.
మరి ఈ సంవత్సరం కష్టాలు ఎక్కువగా ఉంటాయా?”
అయితే పండితులు చెప్పేది ఏమిటంటే పేరు అర్థం అలా ఉన్నా భక్తి పరముగా చూస్తే,
*పరాభవ* అనే పదం వెనుక ఉన్న అసలు భావం చాలా పవిత్రమైనది.
*పరాభవ* అనే పదం యొక్క భక్తిభావ లోతైన అర్థం
*పరాభవ* అనే పదాన్ని రెండు భాగాలుగా చూడాలి.
*1) పరా*
*పరా* అంటే *పరా భట్టారిక* *పరాత్పరి*— ఇది *లలితా త్రిపురసుందరి* / పార్వతి దేవికి సంబంధించిన పేరు.
*2)భవ*
“భవ” అంటే భవుడు — అంటే పరమశివుడు.
అందువల్ల *పరా + భవ = పరాభవ* అంటే పార్వతి పరమేశ్వరుల సమ్మిళిత కృపను సూచించే సంవత్సరం అని భావించాలి.
*పరాభవ నామ సంవత్సరం యొక్క భావం:*
సనాతన ధర్మంలో సంవత్సరాల పేర్లు యాదృచ్ఛికంగా పెట్టలేదు.
ప్రతి సంవత్సరం పేరుకు సంస్కృత పేరుతో పాటు ఒక ఆధ్యాత్మిక భావం ఉంటుంది.
పరాభవ నామ సంవత్సరం సూచించేది ఏమిటంటే,
ఆదిదంపతులైన పార్వతి – పరమేశ్వరులు తమ పిల్లలైన భక్తులను రక్షించే సంవత్సరం దైవ కృపతో సామరస్యం, శాంతి పెరిగే సంవత్సరం అందువల్ల ఈ సంవత్సరం పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు.
సంవత్సరం పేరు కంటే మన ఆచరణ ముఖ్యము. ఈ సంవత్సరం మనం సత్యం, ధర్మం, భక్తి, సత్సంకల్పంతో జీవిస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
పార్వతి పరమేశ్వరులను భక్తితో స్మరిస్తూ ఉంటే వారి కరుణతో మనకు కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, మనశ్శాంతి. అభివృద్ధి
లభిస్తాయి.
ఉగాది యొక్క అసలు సందేశం.
ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం కాదు.
ఇది మనకు గుర్తు చేసే విషయం.
🌱 కొత్త ఆలోచనలు ప్రారంభించాలి.
🌱 పాత చెడు అలవాట్లు వదలాలి.
🌱 ధర్మ మార్గంలో నడవాలి.
ఉగాది పచ్చడి కూడా ఇదే సందేశం ఇస్తుంది. జీవితంలో తీపి, చేదు, కారం, పులుపు అన్నీ ఉంటాయి.
అన్నిటినీ సమంగా స్వీకరించగలిగితే జీవితం సమతుల్యంగా ఉంటుంది.
కాబట్టి *“పరాభవ నామ సంవత్సరం”* అంటే అవమానాల సంవత్సరం కాదు.
అది పార్వతి పరమేశ్వరుల కృప మనపై ఉండే సంవత్సరం అని పండితులు వివరంగా చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి