3, డిసెంబర్ 2020, గురువారం

COVID19 #SputhnikV

 #COVID19

#SputhnikV


కరోనా వైరస్ నివారణకు రష్యా తయారు చేసిన #స్పుత్నిక్5  (SputnikV) టీకా మన దేశానికి వచ్చేసింది. డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. 


భారత్ లో ఈ టీకాను అత్యవసర వినియోగానికి త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది.


కాగా ఐక్యరాజ్య సమితి 75వ సర్వసభ్య సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటన మేరకు ఐక్యరాజ్యసమితి సిబ్బందికి స్వచ్ఛంద టీకాలు వేయడానికి స్పుత్నిక్ 5ను అందించారు. 


వచ్చే వారం నుండి రష్యాలో ప్రజలకు పెద్ద ఎత్తున టీకాలు వేయాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు.


ఇప్పటివరకు దాదాపు లక్షమంది పై ఈ వ్యాక్సిన్ తో ప్రయోగాలు చేశారు. టీకాలు వేయించుకున్న వారిలో రష్యా అధినేత పుతిన్ కుమార్తె కూడా ఉంది.‌ ఎవరికీ ఎటువంటి చెడు ఫలితాలు రాలేదు. కరోనా వైరస్ నివారణకు ఇచ్చే టీకాల్లో స్పుత్నిక్ V ఒకటే అత్యంత చౌక. దీని ధర 10 డాలర్ల కన్నా తక్కువ. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 730 కన్నా తక్కువ ధరకే  లభిస్తుంది.

కామెంట్‌లు లేవు: