*వేదం చెప్పిన ప్రకారం..*
మనిషి నిత్యమూ భగవంతుడిని పూజించాలి.
భగవంతుడి నామస్మరణ చేయాలి.
విధిగా తన కర్మాచరణను ధర్మమార్గంలో తప్పక ఆచరించాలి.
భారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత లాంటి గ్రంధాలను చదవాలి. వీటివలన మనోవికాసం, ఆత్మస్థైర్యం, జీవన విధానం, పెద్దల యందు గౌరవం, పశు పక్ష్యాదుల యందు ప్రేమ తెలుస్తాయి.
పెద్దలను గౌరవించాలి.
పెద్దలను విమర్శించకూడదు.
పెద్దవారు చెప్పిన మంచి మాటలను ఆచరించాలి.
పెద్దవారు.. పిల్లలను సన్మార్గంలో నడిపించే విధంగా పెంచాలి.
పిల్లలను ప్రేమగా పెంచాలి. కానీ అతి గారాబం వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉందని పెద్దలు గ్రహించి.. పిల్లను ఎల్లప్పుడూ జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి.
పెద్దవారు ఎలాంటి సందర్భాల్లో కూడా పిల్లలకు క్షమాపణలు చెప్పడం చేయరాదు. దీనివలన పిల్లలకు ఆయుఃక్షీణం.
పశు - పక్ష్యాదులకు తిండిని, నీటిని ఏర్పాటు చేయాలి.
ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నం చేయాలి.
పేదలకు, అనాథలకు, పిల్లలకు సహాయం చేయాలి. వీరికి తిండి, వస్త్రములను సమకూర్చాలి.
మంచి పనులను చేస్తూ.. వాటినుంచి ఫలితములను ఆశించకూడదు.
ఎదుటివారిని దూషించే విధంగా మాట్లాడడం చేయరాదు.
నిత్యమూ బ్రాహ్మీ ముహూర్తములో స్నానం చేసి.. భగవంతుడిని అర్చించాలి.
అన్నమును దూషించరాదు. పడవేయకూడదు.
అన్నమును తింటూ.. చెడు మాటలు, చెడు ఆలోచనలు చేయరాదు. వీటివలన తినే ఆహారం విషతుల్యం అవుతుంది.
మంచి శుభ్రమైన వస్త్రాలను ధరించి.. దేవాలయంలో భగవంతుడిని దర్శనం చేసుకోవాలి.
*🙏హరే కృష్ణ🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి