శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము
నాధు డారీతి కడలిలొ నావ తోడ
మునుగ జూచి కళావతి మూర్ఛ నొందె.
తల్లి శైత్యోపచారముల్ సల్పు కతన
మఱల లేచియు దుఃఖించె మగని గూర్చి 149
అంత నాయమ చింతించి యంతరమున
పావనంబైన తనపతి పాదుకలను
సేకరించియు వానితో చేర చావు
నిర్ణయము పొందె ప్రాయోపవేశమునకు 150
భర్త గతియించె ననియెడి భావమునను
నిలువ జాలక మరణించ నెంచినట్టి
కూతురును గాంచి యత్యంత కుమిలి పోయి
దిక్కు దోచక సాధువు చిక్కి వ్యధలొ. 151
"సత్యదేవుని లీలచే సర్వమిట్లు
సంభవించెను" యనిమది తలచి నమ్మి
వణిజు డత్యంత ప్రార్థించె వరదుడైన
సత్యనారాయణస్వామి సత్కృపకును 152
పిదప సాధువు యందరిన్ పిలుచు కొనియు
సత్యదేవుని భక్తితో సన్నుతించి
తప్పులను గావ యార్తితో తరచి వేడి
మహిని సాష్టాంగవందన మాచరించె 153
వణిజుండావిధి భక్తితొ
మనమందున యార్తితోడ మన్నించు మనన్
కని శ్రీపతి ముదమందియు
కనికరమున యిట్లు పలికె గగనము నుండీ 154
"సత్యనారాయణ సద్వ్రత మొనరించి
పుణ్య ప్రసాదంబు పొంద రేని
యా వ్రత ఫలితంబు వారి జేరకనుండు
యపచార మేర్పడు యంత్యమునను
వణిజుడా ! నీ పుత్రి వ్రతమును పూర్తిగా
సద్భక్తి తోడను సల్పె మిగుల
పతి వచ్చినాడను పరితోష మందున
మత్ప్రసాదంబును మఱచి వచ్చె
యా కారణంబుచే యామెకు పతిదేవు
దర్శన భాగ్యంబు దక్కదయ్యె
యతడు నా మహిమచే యంతర్హితుండయ్యు
నడిసంద్రమున జేరె నావ తోడ
వెంటనే యామె తడయక యింటి కేగి
మత్ప్రసాదంబు గైకొని మగిడి రాగ
యంతయునుదీరి మీకెల్ల యగును శుభము
భర్తతో యామె సుఖములు బడయ గలదు" 155
సశేషము ..
✍️ గోపాలుని మధుసూదన రావు🙏శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము
నాధు డారీతి కడలిలొ నావ తోడ
మునుగ జూచి కళావతి మూర్ఛ నొందె.
తల్లి శైత్యోపచారముల్ సల్పు కతన
మఱల లేచియు దుఃఖించె మగని గూర్చి 149
అంత నాయమ చింతించి యంతరమున
పావనంబైన తనపతి పాదుకలను
సేకరించియు వానితో చేర చావు
నిర్ణయము పొందె ప్రాయోపవేశమునకు 150
భర్త గతియించె ననియెడి భావమునను
నిలువ జాలక మరణించ నెంచినట్టి
కూతురును గాంచి యత్యంత కుమిలి పోయి
దిక్కు దోచక సాధువు చిక్కి వ్యధలొ. 151
"సత్యదేవుని లీలచే సర్వమిట్లు
సంభవించెను" యనిమది తలచి నమ్మి
వణిజు డత్యంత ప్రార్థించె వరదుడైన
సత్యనారాయణస్వామి సత్కృపకును 152
పిదప సాధువు యందరిన్ పిలుచు కొనియు
సత్యదేవుని భక్తితో సన్నుతించి
తప్పులను గావ యార్తితో తరచి వేడి
మహిని సాష్టాంగవందన మాచరించె 153
వణిజుండావిధి భక్తితొ
మనమందున యార్తితోడ మన్నించు మనన్
కని శ్రీపతి ముదమందియు
కనికరమున యిట్లు పలికె గగనము నుండీ 154
"సత్యనారాయణ సద్వ్రత మొనరించి
పుణ్య ప్రసాదంబు పొంద రేని
యా వ్రత ఫలితంబు వారి జేరకనుండు
యపచార మేర్పడు యంత్యమునను
వణిజుడా ! నీ పుత్రి వ్రతమును పూర్తిగా
సద్భక్తి తోడను సల్పె మిగుల
పతి వచ్చినాడను పరితోష మందున
మత్ప్రసాదంబును మఱచి వచ్చె
యా కారణంబుచే యామెకు పతిదేవు
దర్శన భాగ్యంబు దక్కదయ్యె
యతడు నా మహిమచే యంతర్హితుండయ్యు
నడిసంద్రమున జేరె నావ తోడ
వెంటనే యామె తడయక యింటి కేగి
మత్ప్రసాదంబు గైకొని మగిడి రాగ
యంతయునుదీరి మీకెల్ల యగును శుభము
భర్తతో యామె సుఖములు బడయ గలదు" 155
సశేషము ..
✍️ గోపాలుని మధుసూదన రావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి