14, డిసెంబర్ 2020, సోమవారం

పురాణ పారాయణం

 ➖➖➖➖➖➖➖➖

 ★ పురాణ పారాయణం ★

★ ఆసక్తి కరమైన అంశం ★

➖➖➖➖➖➖➖➖


వేదం పవిత్రం


భారత జాతికి అమృత ప్రాయములైన రామాయణ, భారత, భాగవతాలను, వేదాలను రచించిన 

ఏకైక వ్యక్తి బహుశా దాశరథి రంగాచార్య గారేనేమో! ఆయన వ్రాసిన ఋగ్వేద సంహిత ఉపోద్ఘాతంలో చాలా ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. అందులో మచ్చుకు కొన్ని:

“వేదము పవిత్రం అయింది. అన్యమత గ్రంథాలవలె పేరుకు ముందు వెనుక ‘పవిత్ర’ పదం లేదు. 

మంత్రానికి మాన్యత వుంది. అయినా అది మాన్యత గలది అని వాచ్యంగా చెప్పడం జరగలేదు”.

“వేదములన్నీ సంకల్పము, రహస్యము, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, ఇతి హాసములు, 

వ్యాఖ్యానములు, పురాణములు, స్వరములు, సంస్కారములు, నిరుక్తములు, అనుశాసనములు, 

అనుమార్జనములు, వాక్కు యొక్క వాక్యముల సహితముగా నిర్మించబడినవి”.

“వేదము ఏనాటిదో తెలియదు. ఎన్నడు మొదలయిందో తెలియదు. అది అనాగరిక మానవుని 

నుంచి నిర్మలంగా నిష్కల్మషంగా ప్రవహించింది. మనిషి మనసు మలినాన్ని దూరం చేసింది. మానవుని దైవత్వపు అంచులకు కొనిపోయింది”.


“వ్యాసభగవానుడు ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని మాసములు, ఎన్ని సంవత్సరములు, 

నిరంతరం కృషి చేసి వేదములను నాలుగుగా నిర్ణయించినాడో! దాన్ని గురించి కనీసం అంచనావేయగల 

శక్తి స్తోమతలు మనకు లేవు. మనది అల్పబుద్ది. మనం అల్పాయుష్కులం. వేదాలను వేదవ్యాసుడు సంకలనం చేశాడు. అందుకే అవి వేద సంహితలు. అవే...ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, 

సామవేద సంహిత, 

అథర్వవేదం సంహిత. 

ఇలా నాలుగు విధాలుగా వేదాన్ని విభజించడాన్ని

‘వేదచతుష్టయ’ మని అంటారు”.

“వేదము అపౌరుషేయం. అంటే, మానవ ప్రోక్తం కాదు. ఋషులు వేదద్రష్టలు. స్మర్తలు. వారు

అపౌరుషేయమైన వేదాన్ని దర్శించి మనకు అందించారు. వేదము ఒకనాడు పుట్టి ఒకనాటికి పూర్తి 

అయిన కావ్యం లాంటిది కాదు. ఇది ఒక స్రవంతి. ఒక నిర్ఘరి. ఒక నది. ఒక ప్రవాహం. దర్శించిన ఋషి

చెపుతూ పోయాడు. దానిని అక్షరబద్ధం చేస్తూ పోయారు. ఈ ప్రవాహం వ్యాసుడు సంహితలు చేసేవరకు సాగింది. తదుపరి సకల నదులు కూడిన తటాకంవలె మానవాళికి ఉపకరిస్తున్నది”.

“వేదము శృతి. వినదగింది. వినసొంపుగా ఉండడానికి వేదానికి స్వరం ఉంది. స్వరయుక్తంగా 

చదివిన వేదం శ్రావ్యంగా ఉంటుంది. అది శక్తిమంతం సాధించగలదు”.

“బ్రాహ్మణులు ఒక జాతిగా వేదాన్ని, భారత సంస్కృతిని రక్షించడానికి ఎన్నో త్యాగాలు చేశారు”.

“మానవులకు, మానవ సమాజానికి హితవు చేకూర్చిన వారు దేవతలు అనవచ్చు. ప్రకృతి శక్తులైన సూర్య, చంద్ర, అగ్ని, వాయువులు మున్నగువానివలనే మానవుడు జీవిస్తున్నాడు. కావున పృధివి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము స్థూలముగా దేవతలు. అవికాక వృక్ష లతా గుల్మాదులు పర్వతాదులు దేవతలే. ఈ దేవతలు వేరువేరుగా కానీ, అందరు కలిసిగాని పరాత్పరుడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, 

పరమేశ్వరులు కారు. సృష్టికర్త అగు ఆ పరమేశ్వరుడు

అగమ్యగోచరుడు. అనిర్వచనీయుడు. అందడు. 

పరమాత్మ సాకారమా? నిరాకారమా? దీనిని గురించి చర్చలు, సిద్ధాంతాలు, తాత్విక చింతనలు జరుగుతున్నాయి. కాని నిర్ణయం జరగలేదు. అతడు మనిషికి అందని మహోన్నతుడు. 


ధన్యవాదాలు 🙏

కామెంట్‌లు లేవు: