14, డిసెంబర్ 2020, సోమవారం

జలము కనుగొను విధానము

 నిర్జల ప్రదేశము నందు చెట్లును మరియు రాళ్లను బట్టి భూమి యందు జలము కనుగొను విధానము -


ద్వారము లేనిది కూపము అనియు, ఒక ద్వారము కలది వాపిక అనియు, నాలుగు ద్వారములు కలది పుష్కరణి అనియు , పొడవుగా ఉండునది దీర్గిక అనియు, కాలువతో నీటి ప్రవాహాలు చేత నిండునది తటాకం అని చెప్పబడును.


 * తెల్లని వస్త్రము వంటి రంగును, తెనే వర్ణం గల రాళ్లు ఏ ప్రదేశం నందు ఉండునో, అచ్చట సకల ప్రాణులకు సుఖము నిచ్చెడి జలం సమృద్ది కలిగి ఉండును.


 * వైడుర్యాలు, పెసలు, తుమ్మెద ఈ వర్ణములు గల రాళ్లు సమీపము నందు సమృద్ది గల జలమును, మరియు ముత్యములు , బంగారం , వెండి, హరిదళము వీని చాయలు కలిగిన రాళ్లు అక్కడ సంపూర్ణ జలం ఉండును.


 * మద్ది చెట్టు, బిల్వ వృక్షం, నెల్లి చెట్టు, తిప్పతీగ , పొన్నగంటి ఇవి కలిగిన చోట జలం ఉండును. మరియు సున్నపు రాతితో చేరిన నల్ల మృత్తిక కాని , ఎరుపు మృత్తిక కాని , కుశ, దర్భ కల చొట్ల జలం ఉండును. ఖర్జూరము , నేల తామర, తామర, కానుగ మొదలగు యుండు ప్రదేశములో , పచ్చిక కల ప్రదేశముల యందు జలం ఉండును.


 * సున్నపు రాళ్ళతో కూడి ఎరుపు అగు భూమి యందు చేదు నీళ్లు ఉండును. తీగలు, ఆకులు దట్టముగా, పచ్చగా ఉండు ప్రదేశం యందు జలం ఉండును. కపి వర్ణం గల భూమి యందు ఉప్పు నీరు దొరుకును. తెల్లటి నేలయందు కొంచం ఉప్పు గల నీరు పడును. నలుపు భూమి యందు నీరు మధురంగా ఉండును. కొండ మీద కొండ ఉండిన నొక మట్టున జలం ఉండును.


జలము కనిపెట్టు విధానము -


  బావి తవ్వునట్టి స్థలము ను నిశ్చయించి ఆ ప్రదేశం నందు 12 అంగుళముల లోతు గుంట చతురస్ర ఆకారముగా తవ్వి సాయం సమయమున దాని నిండా నీరుని నిండించి గంధ పుష్పాదుల చేత నలుదిశల యందు పూజించి తెల్లవారిన పిదప ఆ గుంతను పరీక్షించగా నీరు ఉండిన భూమిలో అధిక జలం ఉండును. బురదగా ఉండిన స్వల్పజలం ఉండును. నేల నెర్రలు బారి యుండిన అసలు అక్కడ జలం ఉండదు.


 * నేరెడు చెట్టుకి తూర్పు భాగమునందు పుట్ట యున్న యెడల దానికి దక్షిణము నందు ఇద్దరు పురుషుల లోతున మధురమైన నీరు , పురుషార్ధ ప్రమాణం నందొక మత్స్యమును , బూడిద వర్ణం గల రాళ్లు ను కృష్ణ వర్ణం గల రాళ్లను , కృష్ణ వర్ణం గల మృత్తిక యును దాని కింద సంపూర్ణ జలం ఉండును.


 * మేడి చెట్టు యున్న యెడల దానికి పశ్చిమం నందు మూడు మూరలలో 35 మట్టు ప్రమాణం నందు తెల్లని పాము ను , నల్లని శిలయు ను దాని క్రింద తూర్పు నుండి ప్రవహించే మధురజల నాడి యుండును.


 * ప్రబ్బలి చెట్టు ఉండినట్లైతే దానికి పడమట దిశ యందు మూడు మూరల దూరంలో అర్ధ మట్టులో శ్వేత మండూకము ను , పచ్చని మృత్తిక యును, దాని క్రింద పగలగొట్టడానికి వీలైన శిలయు ఉండును. దాని క్రింద సమృద్దిగా జలం ఉండును.


 * మద్ది చెట్టు ఉండినట్లైతే దాని క్రింద పుట్ట ఉండిన యెడల మద్ది చెట్టుకి పడమర దిశ యందు మూడు మూరల దూరం నందు 35 మట్టు ప్రమాణం నందు బూడిద రంగు గల మృత్తికయును, దాని క్రింద కృష్ణ వర్ణం గల మృత్తిక యు , తెలుపు, పసుపు రంగుల గల ఇసుకయు, దాని క్రింద నిర్మల జలము దొరుకును.


 * ముత్త పులగపు చెట్టును, రేని చెట్టు నుండి దానికి పడమట దిశ యందు 31 మట్టు లోతున జలం ఉండును. పురుష ప్రమాణం నందు విషము లేని రెండుతలల పాము ఉండును.


 * వావిలి చెట్టుకి పుట్ట చుట్టుకొని యుండిన దానికి దక్షిణము నందు మూడు మూరల దూరం యందు 21 మట్టున మంచి జలం ఉండును. అలాగే అర్ద పురుష ప్రమాణం నందు ఎర్రని చేపయు, దాని క్రింద కపిల వర్ణం గల మృత్తిక యు, దాని కింద తెల్లని వర్ణం గల మృత్తిక యు, దాని క్రింద ఇసుకయు, దాని క్రింద సున్నపురాయి, దాని క్రింద జలం యుండును.


 * మేడి చెట్టు, మారేడు చెట్టు కూడి యుండిన దానికి దక్షిణ దిశ యందు మూడు మూరల దూరం నందు మూడు నిలువుల లోతున మంచి జలం ను , 15 నిలువు లోతున కప్ప యుండును.


 * బ్రహ్మ దండి చెట్టు ఉండిన దానికి తూర్పు దిశ యందు మూడు మూరల దూరమున 3 మట్ల ప్రమాణం న దక్షిణము నుండి ప్రవహించే డి ఉదక ధారయు , దాని క్రింద నల్లని రంగు గల మన్నును , బూడిద రంగు గల మృత్తిక యు , మేక వాసన గల చేపయు , దాని క్రింద అమృత తుల్యమైన ఉదకం ఉండును.


 * జల రహిత ప్రదేశం నందు జిల్లెడు చెట్టు ఉండిన దానికి వాయువ్య దిశ యందు రెండు మూరల దూరము నందు మూడు నిలువుల లోతున జలనాడి యుండును.


 * కానుగ చెట్టు ఉండిన దానికి దక్షిణపు దిక్కు నందు అర్ద మట్టు లోతున తాబేలు , దానికింద తూర్పు నుండి ప్రవహించే డి జలదారయు , దాని క్రింద ఉత్తరము నుండి ప్రవహించె డి జలదారయు , దాని క్రింద పచ్చని పాషానమును , దాని క్రింద సంపూర్ణ జలం ఉండును.


 * నిర్జల ప్రదేశం నందు ఏ వృక్షము క్రింద నైనను , కప్ప యుండిన దానికి మూరెడు దూరము నందు 4 నుండి 5 మట్టు లోతున జలము ఉండును. అందొక నిలువులోతున ముంగీసయు , నల్లని రంగు గల మన్ను ను , ఆకుపచ్చ రంగు మన్నును , శ్వేత వర్ణం గల మన్నును , కప్ప వన్నె గల శిలయు, దాని క్రింద సమృద్దిగా ఉదకం ఉండును.


 * ఇప్పచెట్టు ఉండిన దానికి ఉత్తరముగా పుట్ట యుండిన దానికి ఉత్తరము నందు అయిదు మూరల దూరం నందు నాలుగు మట్టుల లోతున తూర్పు నుండి ప్రవహించె డి జలధార యుండును.


 * మారేడు చెట్టు, కానుగ చెట్టు, జీడి చెట్టు, మద్ది చెట్టు, చిట్టాముదపు చెట్టు వీటి యందు ఏ చెట్టు కైనా పుట్ట చుట్టుకొని యుండిన దానికి ఉత్తరమున 3 మూరల దూరము నందు నాలుగున్నర నిలువు లోతున సమృద్ధిగల జలం ఉండును.


 * తాటి చెట్టు నకు గాని , టెంకాయ చెట్టునకు గాని పుట్ట ఆవరించి ఉండిన దానికి పశ్చిమం దిశ యందు ఆరు మూరల దూరమున నాలుగు మట్ల లోతున దక్షిణము నుంచి వచ్చెడి జలధార యుండును. మరియు కొబ్బరి చెట్టుకి దక్షిణమున పుట్ట యుండిన దానికి 7 మూరల దూరమున 5 మట్టుల లోతున సమృద్ధ జలము కలిగి ఉండును.


 * నీరు లేని నిర్జల ప్రదేశము నందు నడుచుచున్నప్పుడు గంబీరమైన శబ్దం పుట్టిన యెడల నచట 3 లెక 4 పురుష ప్రమాణమున ఉత్తరము నుండి ప్రవహించె డి జలనాడి యుండును.


 * యే వృక్షము నైనను వాటి వాటి స్వభావం మారి , చిగుళ్లు , పువ్వులు , కాయలు మొదలగు వాటి భ వర్ణములు భేదముగా ఉండిన యెడల దానికి తూర్పున మూడు మూరల దూరమున 4 మట్టులలో జలం ఉండును.


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: