14, డిసెంబర్ 2020, సోమవారం

ఇచ్చే చేయి*

 🙏 శుభోదయం 🤝

🌷 మంచిమాట 🌷

     *ఇచ్చే చేయి*

ప్రకృతిని నిశితంగా గమనిస్తే సర్వత్రా 'ఇవ్వడమే'కనిపిస్తుంది. గాలి ప్రాణవాయువై జీవుల్ని బతికిస్తుంది. చెట్లు కమ్మని పళ్ళు ఇచ్చి క్షుద్బాద తీరుస్తాయి. నదులు తియ్యని నీరిచ్చి దాహార్తిని ఉపశమింపజేస్తాయి. ప్రకృతికి వనరులను ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు...

అమ్మ స్తన్యం తాగడంతో మొదలయ్యే మనిషి జీవితం చివరి క్షణాల్లో తులసి తీర్థం పోయించుకోవడంతో అంతమవుతుంది. నడిమి జీవితం చాలావరకు పుచ్చుకోవడంతోనే సాగుతుంది..

పుణ్యంతో ముడిపెట్టి మనిషిలోని దానగుణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాయి.ఇచ్చే చేయి కలిగి ఉండటం గొప్ప అదృష్టం. చాచే చెయ్యి వెనుక సిగ్గుతో ముడుచుకు పోయే హృదయం ఉంటుంది..

దానం చేయడానికి మనసుండాలి, చేయి సహకరించాలి. కాలు చేయి ఆడుతున్నప్పుడే తోచినంత దానం చేయగలిగితే ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. అంటారు వేద ప్రియులు. ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో దానం చేసేవారు కొందరైతే చేతికి ఎముక లేకుండా దానం చేసేవారు మరికొందరు. తమ కోసం ఏమి మిగుల్చుకోకుండా దానం చేసేవారు అరుదుగా ఉంటారు. కీర్తి కోసం కాకుండా, కైవల్య ప్రాప్తి కోసం దానం చేసేవారి అడుగు అలవోకగా మోక్షమార్గంపై పడుతుంది.👍

కామెంట్‌లు లేవు: