*కార్తీక అమావాస్య 2020 Date, పోలి స్వర్గం ఎప్పుడు?*
పోలి పాడ్యమి పూజ
కొంతమంది కార్తీక బహుళ పాడ్యమి నుండి అమావాస్య దాకా దీపారాధనలు పెడతారు. తర్వాత మరునాడు పాడ్యమి రోజు మనం నది దగ్గరకు వెళ్ళి, మనం ఈ నెల రోజులూ దీపాలు పెట్టిన దానికి గాను, మనం ఆ నదిలోకి వదిలేసి ఈ దీపాలు కార్తీక దీపాలుగా ఉద్వాసన చెపుతున్నాం. ఆరోజే పోలి స్వర్గానికి వెళ్ళటం అని చెప్పుకుంటుటాము. కానీ ఈ సంవత్సరం కార్తీక బహుళ అమావాస్య అంటే కార్తీకమాసం సోమవారంతో ఆఖరి అయిపోతుంది. మరి మనం నదిలో దీపాలు వదిలి దానికి ఉద్వాసన చెప్పాలంటే మంగళవారం కూడదు కదా పవిత్రంగా మహాలక్ష్మిస్వరూపమయినటువంటి దీపాలుగా మనం ఈ నెల రోజులు పెట్టాం. మరి మంగళవారం రోజు ఎలా వదులుతాం ,కనుక మనం ఈ దీపాలు మంగళవారం రోజు వదలకుండా తరువాత రోజు బుధవారం రోజు వదలాలి. ఈ మంగళవారం రోజు కూడా యధావిధిగా దీపాలు పెట్టాలి . మరి మంగళవారం వచ్చింది కదా, రేపు వదులుదాము అని ఆగకూడదు. కార్తీక దీపాలు మనం ఎలా అయితే నెలరోజులూ పెట్టుకొచ్చామో, అట్లాగే ఈ మంగళవారం రోజు కూడా మన శివాలయంలోపెడితే శివాలయం , విష్ణు ఆలయంలో పెడితే విష్ణు ఆలయం , తులసి దేవి దగ్గర పెడితే తులసి దేవి దగ్గర, లేదా ఇంట్లో లేదా అమ్మవారి దేవాలయాల్లో ఎక్కడ మనంపెడుతున్నామో,నిత్యం మనం ఎలా అయితే చేస్తున్నామో , మంగళవారం రోజు కూడా అలాగే చేసి, బుధవారం రోజు సూర్యోదయానికంటే ముందు నది దగ్గరకు వెళ్లి, మనం అరటి దొప్పల్లో కాని , ఎండు కొబ్బరి చిప్పలలో కాని, కొంతమంది ఆకుల మీద అలా ఒత్తి ఆవు నెయ్యిలో నానపెడుతుంటారు. దాన్ని అలాగేఆకుల మీద కొంతమంది వదులుతుంటారు. ఇప్పుడు కొంతమంది ఆధునికంగా కొన్ని థర్మోకోల్ షీట్లులు తీసుకునివచ్చి దాంట్లో వదులుతున్నారు . కాబట్టి మీరు ఏ విధంగా ఏర్పాటు చేసిన బుధవారం రోజు సూర్యోదయానికి కంటే ముందు నది దగ్గరకు వెళ్లి స్నానం చేసుకుని భక్తిశ్రద్ధలతో ఈ ఉద్వాసన తీసుకొనవలసిందిగా తెలియపరుస్తున్నాము.
కనుక 14 తారీఖు అమావాస్య సోమవారం దీపాలు పెట్టుకోండి. 15వ తారీఖు మంగళవారం రోజు దీపాలు పెట్టుకుని , 16వ తారీఖు బుధవారం రోజు నదిలో ఈ దీపాలు వదలవలసిందిగా ెలియపరుస్తున్నాము . ఇంతేకాకుండా ఎవరికైనా దగ్గరలో నది లేదనుకోండి, మీరు రోజూ పిల్లకాలువల్లోస్నానం చేస్తుంటారు, అక్కడే వదలాలి . లేదు కొంతమంది చెరువుల్లో చేస్తుంటారు, అక్కడ వదలండి. కానీ బావులలో చేసేవాళ్ళకు వీలులేదు కదా వాళ్ళుకానీ ,ఇంటిదగ్గర స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టేవాళ్లుంటారు, వాళ్ళు ఎలా చేయాలి? మనం ఒక పెద్ద పళ్ళెం తీసుకొని, దాంట్లో నీళ్లు పోసి, స్నానం చేసిన పిదప, దాంట్లో బాగా నీళ్లు పోసి వెడల్పు పళ్ళెం గాని, స్టీల్ పాత్ర/బేసిన్ గాని లేదా ఇత్తడి పళ్లెంలో నీళ్ళు పోసి దానిలో కొన్ని పూలు వేసి, ఆ పళ్ళెం తీసుకొని మన వాకిట్లో తులసి కోట ముందు పెట్టండి, తులసి కోట కనుక లేకపోత, మన ప్రహరీ లోపలే, ప్రహరీ కనుక లేకపోతే వాకిలికి ముందుగా ఈశాన్యభాగంలో పళ్ళెం పెట్టి అప్పుడు ఆ పళ్ళెంను బాగా నిండుగా లేదా కొంచెం తక్కువగా నీళ్ళు పెట్టి, పూలు దానిలో వేసి ఆ గంగా దేవి గురించి నమస్కారం చేయండి. Ganga Mantram - గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రం చదవండి. లేదా ఓం గంగా దేవి నమః అనండి. లేదు మీరు కావేరీ, గోదావరి. కృష్ణ ఏ నది నైనా తలుచుకోండి. మీ మనస్సు లో, ఏ నదిని తలుచుకుంటే ఆ నది గంగాదేవి రూపంగా మారుతుంది. అప్పుడు మీరు భక్తి శ్రద్దలతో నది లో ఏ విధంగా అయితే ఆ దీపం వాదులుతారో అలా పళ్ళెం లో వదలండి. కాసేపు దీపాన్ని చూస్తూ ఆనంద పడండి. తర్వాత మీ పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. ఆ దీపం కొండెక్కిన తరువాత, మీ పెరట్లో గాని ఎవరు తొక్కని ప్రదేశంలో ఉంచండి. కాబట్టి ప్రతివాళ్ళు కూడా, ఈ చెప్పిన విధానాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా అనుసరించి, కార్తీక దీప ఉద్వాసన చేసి ఆ ఫలితాన్ని పొందవలిసినదిగా తెలియ పరుస్తాను. ఈరోజే కొంతమంది అడుగుతారు పోలి స్వర్గం కు వెళ్ళేది ఎప్పుడు అని. ఈ పోలి స్వర్గానికి వెళ్ళేది అంటే ఆమె కూడా నదిలో దీపాలు వదిలిన రోజే వెళుతుంది. ఈ సంవత్సరం మనం 14 తారీకు సోమవారం, 15వ తారీకు మంగళవారం కూడా దీపాలు పెట్టి, 16వ తారీకు సూర్యోదయానికి ముందే నదిలో దీపాలు వదిలి అందరూ కూడా ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం పొంది, సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది, కార్తీక దీప పలితాన్ని పొందవలసినదిగా తెలియపరుస్తున్నాను.
🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి