14, డిసెంబర్ 2020, సోమవారం

భక్తనిధిః

 567. భక్తనిధిః


భక్తానాం నిధి రివ

భక్తులకు నిధి వంటిది. భక్తుల కోరికలు తీర్చేది. భక్తులకు ఆశ్రయస్థానమైనది. భక్తులు వారికి కావలసినవి ఎంత తీసుకున్నప్పటికీ తరగని నిధులు గలది. దేవీ భాగవతంలో

యస్యా స్తు పార్శ భాగేతు నిధీతవ్యా శంఖపద్మ”

నవరత్నమహానద్యా స్తదా వై కాంచనస్రవా ||

పరమేశ్వరికి రెండు ప్రక్కలా శంఖ పద్మ నిధులున్నాయి. అక్కడ బంగారము, రత్నాలు కలిసిన నదులు ప్రవహిస్తుంటాయి.

పరమేశ్వరి ప్రక్కన శంఖ పద్మ నిధులు ఉన్నాయి. అవి నవనిధులలోకీ శ్రేష్ఠమైనవి. వాటిలో నుంచి ఎంత సంపద తీసుకున్నా అవి తరిగిపోనివి. నవనిధులు


1. కాళ

2. శంఖ

3. వైసర్ప

4. మాణవక

5. మహాకాళ

6. పద్మ

7. పాండుక

8 సర్వరత్న

9. పింగళక


భక్తుల కోరికలు తీర్చటానికే పరమేశ్వరి ఈ నిధులను తన దగ్గర ఉంచుకున్నది.


శ్రీమాత్రే నమః


ధర్మ ప్రచారం


వెంకటేశ్వర ప్రసాదు


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: