14, డిసెంబర్ 2020, సోమవారం

శ్రీరమణీయం* *-(740)*_

 _*శ్రీరమణీయం* *-(740)*_

🕉🌞🌎🌳😷🇮🇳🚩


_*"అశాంతిని సృష్టించే అహంకారం యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోవడం వీలవుతుందా !?"*_


_*అక్కడే ఉన్న వస్తువును చీకటి కనిపించకుండా చేస్తుంది. అహంకారం మనలోనే ఉన్న శాంతిని వ్యక్తం కాకుండా చేస్తుంది. కనిపించని చీకటిని పట్టుకోలేము. కానీ ఒక దీపాన్ని వెలిగించి ఆ చీకటిని పారద్రోలవచ్చు. అలాగే అశాంతికి కారణమైన అహంకారం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. తెలిసిన ధర్మాన్ని ఆచరించడం ద్వారా తెలియని అహంకారం అదృశ్యం అవుతుంది. మనకి, దేహానికి మధ్యవర్తిగా ఉన్న అహంకారమే కష్టసుఖాలకు కారణం. మన ముందు కనిపించే ప్రపంచంలో ఎప్పుడూ సుఖం-సంతోషం ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రపంచం ఎప్పుడూ కష్టసుఖాలు, సంతోషదుఃఖాల మిశ్రమంగానే ఉంది. నిజానికి అవి రెండూ ప్రపంచానివి కావు. మన అహంకారానివి. కష్టాన్ని, దుఃఖాన్ని మనకి తెలిసేలా చేసే అహంకారమే సుఖ, సంతోషాలతో ఉండాలనిపించేలా చేస్తుంది. అదే మాయ !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"*_

_*"దీపంతో అంధకారం - ధర్మంతో అహంకారం అదృశ్యం !''*- *(అధ్యాయం -91) {శ్రీరమణభాషణలు సత్సంగ ప్రవచన మాలిక}*_

_*రచన/బోధన : -తత్వదర్శి/శివశ్రీ గెంటేల వెంకటరమణ,*_ 

_*శ్రీగురుధామ్, బలుసుపాడు, కృష్ణాజిల్లా.*_ 

_*srigurudham.org*_


🕉🌞🌎🌳😷🇮🇳🚩

కామెంట్‌లు లేవు: