🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀114
నేటి...
*ఆచార్య సద్భోదన*
➖➖➖✍️
*శరణాగతి చెందటం అంటే భగవంతుడికి కృతజ్ఞత తెలుపటమే.*
*మనకు సర్వమూ సమకూర్చిన ఆ భగవంతునికి హృద్యయ పూర్వక కృతజ్ఞతలు చూపటం కన్నా మరేమీ ఇవ్వలేము.*
*మనం సంపన్నులమైనా, బీదవారిమైనా, కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా ఆయన రక్షణా వలయంలోనే తిరుగాడుతుంటాం.*
*మనకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు భగవంతునితో మరింతగా కలిసిపోయి మనవలసి ఉంటుంది. *
*మనకు జీవాధారము, జీవన స్ఫూర్తి, దీవెనలు అందజేస్తున్న ఆ పరమాత్మునికి కృతజ్ఞతా వందనములు అర్పించవలసి ఉంది. *
*సర్వాంతర్యామితో సాన్నిహిత్యం కలిగి ఉండకపోతే ఏ మనిషికైనా సంపూర్ణ ఆనందం లభించటం దుర్లభం.*
*విశ్వ సృష్టి కర్తను స్థిరంగా మనస్సులో నింపుకొని సదా ఉండగలగటం పరిపూర్ణమైన వరం సుమా.*✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి