అందరికి కార్తీకసోమవారపు దివ్య శుభాకాంక్షలు.అమావాస్య తిథి వుండటం వలన పితృతర్పణవిధి తండ్రిలేనివారికి తప్పనిసరి.దేవతాపూజకన్న పితృదేవతాపూజ కంపల్సరీ గా ఆచరించాలి.వీలులేనివారు కనీసం బ్రాహ్మణునికి భోజనార్ధం ద్రవ్య వినియోగం చాల మంచిది .ఈ రోజు చేసే స్నానం ,జపం మరియు దైవదర్శనం ఎల్లరకు సర్వదా శ్రేయోదాయకం.శ్రీ సుబ్రమణ్యారాధన ,శివకేశవారాధన సత్ఫలితాలనోసంగగలదు.శ్రీ సాంబసదాశివుని దయ వలన అందరికి మేలు జరగాలని మనసారా కోరుకోంటున్నాను.అందరికి ప్రదోషశివదర్శనం శుభప్రదం. వీలైతే శివాభిషేకం ప్రద (ఇంచుమించుగా సాయంత్రం 5:45 టు 6:45) ఎలినాటి శని ,అర్ధాష్టమశని మరియు అష్టమశనిల నుండి ఆ ఆదిదేవుని కృపచే కోంతకాపాడబడుతారు.
ధనుర్ ,మకర ,కుంభ ,మిధున మరియు తుల రాశులవారు ఆచరించి సత్ఫలితాలను పోందగలరని మనవి. దగ్గరలోని శ్రీశైలమహసిద్ధక్షేత్రదర్శనం వీలైన భక్తులకు సర్వశుభప్రదం.నిన్న సాయంత్రం మాసశివరాత్రి సందర్భంగా శ్రీశైలమహక్షేత్రం లో 300 ప్రమిదలలో 365 వత్తులు వేసి శివలింగాకారంలో ఉత్తరరాజద్వారం(శివాజీ గోపురం )వద్ద లక్షవత్తుల దీపారాధన చేయటం జరిగింది.శుభంభూయాత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి