అమ్మ ప్రేమ మీద కవిసామ్రాట్ విశ్వనాధ వారి పద్యం.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీ మద్రామాయణ కల్పవృక్షంలోనిది ఈ పద్యము.
తానో లాములు “తండ్రి పేరెవరయా"
దాచాత మాలాలు నౌ
లే ! నాపేరన, నమ్మగాల గన, నోలిం దల్లి కౌసల్య తం
డ్రీ ! నాగానన బోయిరాక, కనులన్ నీర్వెట్ట, కౌసల్య నే
గానేకానులె యమ్మనే యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్ !!
తాత్పర్యము
చిన్ని రాముని కౌసల్య దగ్గరకు పిలచి
నీపేరేమిటి అని అడిగిందట. పసివాడైన రాముడు పసి భాషలో లాములు (రాముడు) అన్నాడట.
మరి మీ నాన్నగారి పేరేమిటి అంటే దాచాత మాలాలు (దశరథమారాజు)
అని బాల రాముని జవాబు.
మరైతే నాపేరేమిటి అని కౌసల్య అడిగితే
అమ్మ గాలు (అమ్మ గారు) అన్నాడు.
కాదు నాయనా నాపేరు కౌసల్య
అని సవరించింది.
"కౌసల్య" అనేమాట పసి పిల్లాడికి పలుకడం
కష్టం . ఆ అసహాయతతో పసివాడు కంట నీరు పెట్టాడు .
తట్టుకోలేక కౌసల్య బాలరాముని హత్తుకొని
"కౌసల్య నేకాను" "నీ అమ్మనే" అంటూ
ముద్దాడింది.
ప్రతి బాలుడూ చిన్ని శ్రీరాముడై ప్రతితల్లీ
కౌసల్య వలె అనుభవానుభూతిని ఆస్వాదించాలని ఆశిస్తూ 🙏🙏🙏
సేకరణ:-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి