*శివ దర్శనం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*కార్తీకమాసం* సందర్భం గా *శివదర్శనం* శీర్షికన రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం. ....
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*శ్రీలింగరాజస్వామి- భువనేశ్వర్ - ఒరిస్సా*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
భువనేశ్వరంలో లింగరాజఆలయం పురాతనమైనదిగా ఉన్న అన్ని దేవాలయాలలో అతి పెద్దదిగా పరిగణించబడుతుంది...
11 వ శతాబ్దంలో జైపూర్ రాజు తన రాజధానిని భువనేశ్వర్ నగరానికి మార్చినప్పుడు, అతను లింగరాజఆలయాన్ని నిర్మించే ప్రయాణాన్ని ప్రారంభించాడు...
బ్రహ్మ పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించబడింది.
దేవాలయాల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండగా, జగన్నాథ్ స్వామి వారి ఆకృతిని పొందడం ప్రారంభించిందని, ఈ ఆలయంలో శివుడు మరియు విష్ణువు ఇక్కడ కొలువైఉన్న తీరు ఆధారాల ద్వారా నిరూపించబడింది...
ఈ ఆలయం భారతదేశంలోని పురాతన నిర్మాణాలలో ఒకటి మరియు ఇది సుమారు 1000 సంవత్సరాల పురాతనమైన నిర్మాణమని చరిత్ర.
25000 చదరపు అడుగుల వైశాల్యం తో 15 కిలోమీటర్ల దూరం నుండి చూసినా కనిపించే 180 అడుగులయెత్తు ఆలయశిఖరం తో ప్రాంగణం లో 108 మందిరాలు,శివపరివారం మరియు నందీశ్వరుడు కి ప్రత్యేక మందిరం ఉన్నాయి.
*ఆలయంతో సంబంధం ఉన్న ఒక పౌరాణికకథ :-*
ఒకసారి శివయ్య తన ప్రియమైన పార్వతికి ఈ క్షేత్రం గురించి వివరించినప్పుడు,స్వయం గా తెలుసుకోవడానికి
అమ్మవారు సాధారణ పశువుల కాపరి (గొల్లభామ)రూపంకు మారి నగరాన్ని అన్వేషించడానికి బయలుదేరారు. ఆమె తన ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న కృత్తి,వాస అనే ఇద్దరు రాక్షసులు ఆమె మార్గంలోకి అడ్డువచ్చారు. ఆమె నిరంతరం నిరాకరించిన తరువాత కూడా, వారు ఆమెను అనుసరిస్తూనే ఉన్నారు అప్పుడు అమ్మవారు తనను తాను సురక్షితంగా ఉంచుకోవడానికి ఆమె వారిని తనను భుజాలపై మోయమని కోరి భుజాలపై ఎత్తుకున్న తర్వాత వారిరువురిని అణగ తొక్కి తనను తాను విడిపించుకుంది...
ఈ సంఘటన తరువాత శివయ్య అమ్మవారి దాహార్తి తీర్చడం కోసం బిందుసరస్సు అనే పేరుతో పవిత్ర పుష్కరిణి సృష్టించాడు....
ఈ సరస్సులో స్నానం కాశీ గంగా స్నానం తో సమానం
-నిత్యం స్వామి అభిషేకానికి కావిళ్ళతో నీరు తీసుకువెళ్తారు ఆలయం లోనికి
-ఏటా తెప్పోత్సవ సేవ జరుగుతుంది స్వామికి ఈ సరస్సులో
ఈ సరస్సు చుట్టూ ఎన్నో ఆలయాలు నిర్మితమై ఉంటాయి.
*ఆలయ ప్రాంగణం లోని ఇతర ఆలయాలు:-*
ప్రధాన ఆలయాన్ని
నాలుగు విభిన్న భాగాలుగా విభజించారు,
అవి శ్రీమందిర్ (గర్భాలయం)
జగన్మోహన మండపం(యజ్ఞశాల)
నాట్యమందిరం (ఒడిశా నృత్యాలతో నృత్యార్చన)
మరియు
భోగమండపం(పితృ కర్మలు,తర్పణాలు ఇచ్చే వేదిక)
ప్రాంగణం లో ప్రవేశించగానే పెద్ద రాతిస్తంభం దానిపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు.
ఇక్కడ గర్భాలయం, లింగస్వరూపం స్వయంగా ఉద్భవించినవని నమ్ముతారు . ఈ ఆలయం ర
హరి-హర క్షేత్రంగా గౌరవించబడుతుంది,
ఇది ఒక రహస్య అర్ధాన్ని కలిగి ఉంది. హరుడు విష్ణువు కోసం మరియు హరి శివుడి కోసం, ఇది కలిసి హరి-హరగా మారుతారు.
ఇక్కడి ఆలయంలో కార్తీకేయ , గణేశుడు మరియు పార్వతి దేవి వేర్వేరు దిశలో ఉంటారు. అమ్మవారిని భువనేశ్వరి భగవతి గా కొలుస్తారు..నాగచతుర్ధి కి నాగరాజ అలంకారం ప్రత్యేకం
*నైవేద్యం:-*
వరి అన్నమే నైవేద్యం
ప్రతీరోజు కొత్తకుండల్లో నివేదన
రోజుకు 8 సార్లు భోగ్ హారతి పేరుతో నివేదన ఇస్తారు
ముందుగా సూర్యుని పూజించి సంతృప్తి చేసి సూర్యకిరణాలు మహా నివేదనపై పడకుండా ప్రత్యేక మార్గం ద్వారా గర్భాలయం కు చేర్చి నివేదన సమర్పించే సంప్రదాయం ఇక్కడ అమలవుతోంది.
*మహా దీపారాధన :-*
ప్రతీ నెలా రెండు సార్లు జరుగుతుంది
మహాశివరాత్రికి మరింత ప్రత్యేకం
దీపాలతో ప్రదక్షిణ చేయడం 'సమర్ధ'తెగకు చెందిన ప్రతినిధి కాగడా చేతబూని శిఖరం కు తాడుతో ఎగబ్రాకి శిఖరం పై దీప ప్రజ్వలన చేయడం ఆచారం.ఈ జ్యోతిని దర్శించి తన్మయులవుతారు భక్తులు.
*శిఖరం పై పరశురాముని ధనస్సు :-*
ఈ క్షేత్రం లో శిఖరం పైభాగాన త్రిశూలం ఉండదు పరసురాముని ధనస్సు ఉంటుంది.
ఆలయ నిర్మాణంలో కళింగ శైలి యొక్క జాడకనిపిస్తుంది.
ఈ ఆలయం భారతదేశం యొక్క గొప్ప సంస్కృతిని వర్ణిస్తుంది, ఇక్కడ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయం యొక్క ఆధ్యాత్మిక పారవశ్యం పొందటానికి ప్రయత్నిస్తారు..
ఓం నమః శివాయ 🙏🙏
*సనాతన హిందూ ధర్మం*
☘️☘️☘️☘️☘️☘️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి