2, ఆగస్టు 2023, బుధవారం

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:35/150 


సంగ్రహో నిగ్రహః కర్తా 

సర్పచీరనివాసనః I  

ముఖ్యోఽముఖ్యశ్చ దేహశ్చ 

కాహళి స్సర్వకామదః ॥ 35 ॥  


* సంగ్రహః = మిక్కిలి గ్రహించువాడు, 

* నిగ్రహః = ఆత్మనియంత్రణ కలిగినవాడు, 

* కర్తా = (సర్వ కార్యములు) చేయువాడు, 

* సర్పచీర నివాసనః = పాము కుబుసము వస్త్రముగా ధరించువాడు, 

* ముఖ్యః = ప్రధానమైనవాడు, 

* అముఖ్యః = అప్రధానమైనవాడు; 

                   తనకంటె ఇతరమైన ప్రధానుడు లేనివాడు, 

* దేహః = ప్రతి జీవి దేహము రూపములో ఉన్నవాడు, 

* కాహళిః = మ్రోగుచున్న వాద్యము తానే అయినవాడు, 

* సర్వకామదః = సమస్తమైన కోరికలు ఇచ్చువాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: