2, ఆగస్టు 2023, బుధవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 129*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 129*


🔴 *రాజనీతి సూత్రాణి: షష్ఠాధ్యాయము - (2)*


52. న మీమాంస్యా గురువః 

(పెద్దల్ని విమర్శించకూడదు.)


53. ఖలత్వం నోపేయాత్ (దుష్టుడుగా అవకూడదు.)


54. నాస్తి ఖలస్య మిత్రమ్ 

(దుష్టుడికి మిత్రుడనేవాడు ఉండడు.) 


55. లోకయాత్రా దరిద్రం బాధతే 

(దరిద్రుడికి నిత్యజీవనం కూడా కష్టంగా ఉంటుంది.) 


56. అతిశూరో దానశూరః 

(దానశూరుడే గొప్పశూరుడు.)


57. గురుదేవబ్రాహ్మనేషు భక్తిర్భూషణమ్ (గురువులమీదా, దేవతలమీదా, సద్భ్రాహ్మణుల మీద భక్తి ఉండడం అలంకారం.) 


58. సర్వస్య భూషణం వినయః 

(వినయం అందరికీ అలంకారమే.) 


59. అకులీనో - పి వినయః కులీనాద్విశిష్ట (ఉత్తమకులంలో పుట్టకపోయినా వినియవంతుడు ఉత్తమకులం వాడికంటే గొప్పవాడు.)


60. ఆచారాదాయుర్వర్థతే కీర్తి శ్రేయశ్చ 

(సదాచారం వల్ల ఆయుర్ధాయం, కీర్తి, శ్రేయస్సు వృద్ధి పొందుతాయి.) 


61. ప్రియమప్యహితం న వక్తవ్యమ్ 

(ప్రియమే అయినా హితం కానిది చెప్పకూడదు.) 


62. బహుజనవిద్దమేకం నానువర్తేత 

(చాలామంది అభిప్రాయానికి వ్యతిరేకంగా నడిచే ఒక వ్యక్తిని అనుసరించకూడదు.) 


63. న కృతార్థేషు నీచేషు సంబంధ 

(పనులు చేసి పెట్టే వాళ్ళయినా నీచులతో సంబంధం పెట్టుకోకూడదు.) 


64. ఋణశత్రువ్యాధయో నిఃశేషా కర్తవ్యా (ఋణాన్ని, శత్రువుల్నీ, వ్యాధుల్నీ పూర్తిగా రూపుమాపాలి.) 


65. భూత్యనువర్తనం పురుషస్య రసాయనమ్ (ఐశ్వర్యం అవిచ్ఛిన్నంగా ఉండడమే మనిషికి బలవర్థకౌషధం.) 


66. నారిష్వవజ్ఞా కర్తవ్యా 

(యాచకుల విషయంలో అనాదరం చూపకూడదు.) 


67. దుష్కరం కర్మ కారయిత్వా కర్తరమవమన్యతే నీచాః 

(నీచుడు కష్టమైన పని చేయించుకుని ఆ చేసిన వాడ్నే అవమానిస్తాడు.) 


68. నాకృతజ్ఞస్వ నరకాన్నివర్తనమ్ 

(కృతజ్ఞత లేనివాడు నరకం నుంచి తిరిగి రావడం ఉండదు.) 


69. జిహ్వాయత్తౌ వృద్ధినాశౌ 

(అభివృద్ధియైనా, వినాశనమైన నాలుకమీదనే ఉంటాయి.) 


70. విషామృతయోరాకరీ జిహ్వా 

(నాలుక విషానికీ అమృతానికీ కూడా జన్మస్థానం.) 


71. ప్రియవాదినో శత్రుః 

(ప్రియంగా మాట్లాడే వాడికి శత్రువు ఉండడు.) 


72. సుత్తా అపి దేవాస్తుష్యంతి 

(స్త్రోత్రం చేస్తే దేవతలు కూడా సంతోషిస్తారు.) 


73. అనృతమపి దుర్వచనం చిరం తిష్టతి (అసత్యమే అయినా చెడ్డమాట చాలా కాలం నిలిచిపోతుంది.) 


74. రాజద్విష్టం న వక్తవ్యమ్ 

(రాజుకు ద్వేషం కలిగించే మాట మాట్లాడకూడదు.) 


75. శ్రుతిసుఖాత్ కోకిలాలాపాదపి తుష్యంతి జనాః (చెవికి ఇంపుగా ఉండే కోకిల కూత విన్నా కూడా జనులు సంతోషిస్తారు.) 


76. స్వధర్మహేతుః సత్పురుషః 

(స్వధర్మం నిలబెట్టేవాడే సత్పురుషుడు.) 


77. నాస్త్యర్ధినో గౌరవమ్ 

(యాచకుడికి గౌరవం ఉండదు.) 


78. స్త్రీణాం భూషణం సౌభాగ్యమ్ 

(స్త్రీలకు సౌభాగ్యమే ఐదవతనం, అలంకారం.) 


79. శత్రోరపి న పాతనీయా వృత్తిః 

(శత్రువైనా వాడి కడుపు కొట్టకూడదు.)


80. అప్రయత్నోదకం క్షేత్రమ్ 

(ఎక్కువ ప్రయత్నం చేయకుండా నీరు లభించేదే మంచి పొలం.) 


81. ఎరండమవలమ్య కుజ్జ్ఞంనం న కోపయేత్ (ఆముదంచెట్టు ఆసరా చూసుకొని ఏనుగుకు కోపం కలిగించకూడదు.) 


82. అతిప్రవృద్దాపి శాల్మలీ వారణస్తమ్బో వారణస్తమ్బో న భవతి 

(ఎంత లావుగా పెరిగినా బూరుగచెట్టు ఏనుగును కట్టడానికి ఉపయోగించరు.)


83. అతిదీర్ఘోపి కర్ణికారో న ముసలీభవతి 

(కర్ర ఎంత పొడవుగా ఉన్నా రోకలిగా ఉపయోగించకూడదు.) 


84. అతిదీప్తోపి ఖద్యోతో న పావకః 

(ఎంత ప్రకాశిస్తున్నా మిణుగురు పురుగు నిప్పు కాదు.) 


85. న ప్రవృద్దత్యం గుణహేతుః 

(సంపద పెరిగినంత మాత్రాన సద్గుణాలు రావు.) 


86. సుజీర్ణో పిచుమందో న శజ్కులాయతే 

(ఎంత ముదిరినా వేపకర్ర అడకత్తేరకు ఉపయోగపడదు.) 


87. యథా బీజం తథా నిష్పత్తిః 

(విత్తనాన్ని పట్టి దిగుబడి ఉంటుంది.) 


88. యథా కులం తథా బుద్ధిః 

(చదువును పట్టి బుద్ధి.) 


89. యథా కులం తథాచారః 

(కులాన్ని పట్టి ఆచారం.) 


90. సంస్కృతః పిచుమందో న సహకారో భవతి (ఎంత దోహదం చేసినా వేప తియ్యమామిడి కాదు.) 


91. న చాగతం సుఖం త్యజేత్ 

(వచ్చిన సుఖాన్ని విడిచిపెట్టుకోకూడదు.) 


92. స్వయమేవ దుఃఖమధిగచ్చతి 

(దుఃఖం దానంతట అదే వస్తుంది.) 


93. రాత్రిచారణం న కుర్యాత్ 

(రాత్రులలో తిరగకూడదు.) 


94. న చార్ధరాత్రం స్వపేత్ 

(అర్ధరాత్రి వరకూ మేల్కొని అప్పుడు నిద్రపోకూడదు.) 


95. తద్విద్వద్భిః పరీక్షేత 

(విద్వాంసులతో కలిసి పరీక్షించాలి.) 


96. పరగృహమకారణతో న ప్రవిశేత్ 

(కారణం లేకుండా ఇతరుల ఇంట్లోకి వెళ్ళకూడదు.) 


97. జ్ఞాత్వాపి దోషమేవ కరోతి లోకః 

(జనం తెలిసి కూడా తప్పులు చేస్తుంటారు.) 


98. శాస్త్రప్రధానా లోకవృత్తిః .

(లోకవ్యవహారం శాస్త్రం ప్రకారం జరగాలి.) 


99. శాస్రభావే శిష్టాచారమనుగచ్చేత్ 

(శాస్త్రం లేనప్పుడు శిష్టుల ఆచారం అనుసరించాలి.)


100. నాచారితాచ్చాస్త్రం గరీయః 

(శాస్త్రం వాడుకలో ఉన్న శిష్టాచారం కంటే గొప్పది కాదు.)


101. దూరస్థమపి చారచక్షుః పశ్యతి రాజా 

(రాజు గూడాచారులనే నేత్రంతో దూరంగా ఉన్నదానిని కూడా చూస్తాడు.) 


102. గతానుగతికో లోకః 

(ఒకరు ఏది చేస్తే అందరూ అది చేస్తూ ఉంటారు.)


103. యమనుజీవేత్ తం నాపవదేత్ 

(ఎవర్ని ఆశ్రయించి జీవిస్తున్నాడో వారిని ఆడిపోసుకోకూడదు.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: