2, ఆగస్టు 2023, బుధవారం

బీచుపల్లి క్షేత్రం.*

 https://beechupallybrahmanasatram.com/

*బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం* 

             *బీచుపల్లి క్షేత్రం.*

--------------------------

దాతలకు నమస్సులు!           

జీవనది కృష్ణా నదీ తీరంలో హైదరాబాద్ - బెంగళూరు 44వ జాతీయ రహదారి పైన ఆహ్లాదకరమైన వాతావరణం, ఆధ్యాత్మికత వైభవాన్ని చాటే  బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో గత 17 సంవత్సరాలుగా శ్రీ ఆంజనేయ బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్ట్ బ్రాహ్మణ సేవలో తరిస్తోంది. ఇక్కడికి వచ్చే బ్రాహ్మణ బంధువులకు నిత్యం సమారాధన చేస్తూ వస్తున్నది.  మనకే కాకుండా బీచుపల్లి క్షేత్రాన్ని సందర్శించే రెండు తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ బంధువులతో పాటుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులకు ఆతిథ్యం అందిస్తున్నది. అలాగే పేద, మధ్యతరగతి బ్రాహ్మణుల సౌకర్యం కోసం మినీ ఫంక్షన్ హాలు నిర్మించి అందుబాటులోకి తెచ్చినది.  ప్రస్తుతం ఉన్న మినీ ఫంక్షన్ హాలు పై అంతస్తులో భక్తుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఎనిమిది గదులను నిర్మించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇట్టి నిర్మాణ ఖర్చుల నిమిత్తం దాతల నుంచి విరాళాలు సేకరించదలిచాము. దాతల దాతృత్వానికి గుర్తింపు నిచ్చేందుకు గాను ఒక గది నిర్మాణం కోసం మూడు లక్షలు రూపాయలు విరాళం పొంది ఆ గదికి వారిని దాతగా గుర్తించ దలిచాము. గదిపై వారి పేరు, వివరాలతో శిలాఫలకం ఏర్పాటు చేయబడుతుంది. ఇందుకు గాను రూ. 3,00,000/- విరాళాలను ఆహ్వానిస్తున్నాము. 


అదే విధంగా శ్రీ ఆంజనేయ బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్టు అభివృద్ధి, విస్తరణ ఇతర అవసరాల కోసం దాతలు తమకు తోచిన విధంగా (*Rs.10,000/-లకు తక్కువ కాకుండా*) విరాళములు అందించాలని కోరుచున్నాము. వీటిని నేరుగా సత్రంలో నగదు, చెక్కు రూపంలో చెల్లించ వచ్చును. ట్రస్ట్ బ్యాంకు ఖాతా లోకి బదిలీ చేయ వచ్చును. విరాళం మొత్తానికి తగు రసీదు ఇవ్వబడుతుంది. కాబట్టి బ్రాహ్మణ బంధువులు నిత్య అన్నదానం, వసతి కల్పించే యజ్ఞంలో పాలుపంచుకొని ఈ భవన నిర్మాణ కార్యాన్ని విజయవంతం చేయవల్సినదిగా ప్రార్థన 🙏🙏

————————————-

             వివరములకు:-

WhatsApp : 9440722088 

& 9440457515

    Bank Account Details

Sri Anjaneya Brahamana Nityannadana Trust Beechupally

A/c No. 62022201804

IFC SBIN0020187

Branch: Wanaparthy

కామెంట్‌లు లేవు: