7, నవంబర్ 2023, మంగళవారం

ఆలోచనాలోచనాలు

 @@@ ఆలోచనాలోచనాలు @@@   తెలుగు పద్య సుమ మాలిక  @@@ చాటు పద్యములు @@@ సమస్యాపూరణములు @@@ (ప్రాచీనము- మోచర్ల వెంకన్న కవి )@@@                         "" ఎలుకలు తమ కలుగు లోని కేనుఁగు నీడ్చెన్.""        కం. ఇలలో నిద్దఱు రాజులు / మలయుచుఁ జదరంగమాడి మాపటివేళన్ / బలమెత్త మఱచిన / నెలుకలు తమ కలుఁగు లోనికేనుఁగు నీడ్చెన్.                                 ***** "" రండాగమనంబుఁ జేయ రమ్యంబ యగున్.""     కం. కుండినపురమున రుక్మిణి / చండికకుం బూజసలుపు సమయంబున కా / యండజవాహనుఁ దోడ్కొని / రండా గమనంబుఁ జేయ రమ్యంబ యగున్.                 ***** "" నిప్పున నొక చేరెఁడంత నెత్తురుగాఱెన్.""                   కం. కుప్పించి నెలుఁగు దూఁకిన / గొప్పములిదె నాటె నిపుడు వేగన్ / ఉప్పుఁ గొనిరమ్ము కాతము / నిప్పున, నొక చేరెఁడంత నెత్తురుగాఱెన్.      ***** "" సుగ్రీవుని యెడమకాలు శునకము కఱచెన్.""                               కం. అగ్రారపు నడివీథిని / నిగ్రహముగ బొమ్మలాట నేర్పుగఁ నాడన్ / విగ్రహము లెత్త మఱచిన / సుగ్రీవుని యెడమకాలు శునకము కఱచెన్.                ***** ""కమ్మలు మోకాళ్ళు తాఁకి ఘలుఘలు మనియెన్.""                           కం. కొమ్మను మదనుండపుడు జ / వమ్మున నీలోత్పలముల వడి నేయంగా/ సొమ్మసిలి మోము వంచినఁ / గమ్మలు  మోకాళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్.          ***** "" గాడిద యేడిచెఁగదన్న ఘనసంపన్నా!""                    కం. ఆడిన మాటకుఁ దప్పిన / గాడిదకొడుకంచుఁ దిట్టఁగా విని యయ్యో / వీఁడా నాకొక కొడుకని / గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!                       ***** "" అస్ఖలిత బ్రహ్మచారి కార్గురు పుత్రుల్.""                              కం. ఈస్ఖాప్రాసము దుష్కర / మస్ఖలనతి నీయఁదగునె యది సుకవులకున్?/సస్ఖలితలయి గుహుఁగని / రస్ఖలిత బ్రహ్మచారి కార్గురుపుత్రుల్.                          ***** "" మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్.""                           కం. హిత మాచరించువారికి / హిత మొనరించుచును సుజనహితుఁ డగుచును దు/ దుష్కృతమెప్పుడుఁ జేయను స / మ్మతి లేని నరుఁడు మిగుల మన్నన నొందున్.                               తేది 7--11--2023, మంగళవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: