7, నవంబర్ 2023, మంగళవారం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


కాంతా! వెంటనే వెళ్ళు. ఆ దేవవైద్యులను నా మాటగా ఆహ్వానించు. ఇక్కడికి తీసుకురా.

ఇందులో ఆలోచించవలసింది ఏమీలేదు. వారు చెప్పినట్టు చెయ్యి - అని అనుమతించాడు చ్యవనుడు.

సుకన్య త్వరత్వరగా అశ్వినులను సమీపించింది. సూర్యపుత్రులారా! మీ షరతుకి అంగీ

కరిస్తున్నాను. రండి. మా ఆశ్రమానికి వచ్చి నా భర్తను మీతో సాటివచ్చేవాడుగా మార్చండి - అంది. ఆమెతో

అశ్వినులిద్దరూ చ్యవనమహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతడిని సమీపసరోవరానికి తీసుకురమ్మని తాము

ముందునడిచారు. సరోవరంలో దిగి స్నానం చెయ్యమన్నారు. చ్యవనుడు నీళ్ళల్లోకి దిగాడు. అతడి

వెనకగా అశ్విమలు దిగారు. ముగ్గురూ ఒక్కసారిగా మునిగారు. లేచేసరికి ముగ్గురూ సమానరూప

యౌవన సౌందర్యాలతో కనిపించారు మకన్యాదేవికి. తన కన్నులను తానే నమ్మలేకపోయింది. ఆనంద

బాష్పాలు కమ్ముకున్నాయి. బొమ్మలా నిలబడి చూస్తోంది.

వరవర్ణివీ! మా ముగ్గురిలో నీకు నచ్చిన భర్తమ వరించు. అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో

గుర్తించు - అన్నారు ముగ్గురూ కలిసి ఏకకంఠంతో.కంఠస్వరాలు కూడా ఒక్కలాగే ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది పెద్ద పరీక్ష అయ్యింది.

సంశయంలో పడింది. భర్తను గుర్తుపట్టలేక మథనపడింది. ఏమి చెయ్యను? ఈ దేవతలు ఇంద్రజాలం

కల్పించారు. ఇది నాకు మరణావస్థలాగా ఉంది. పొరపాటున అశ్వినులలో ఒకరిని వరించానంటే ఎంత

ప్రమాదం! ఎలాగ, ఎలాగ? - అనుకుంటోంది. ఎంతకీ తెమలలేదు. దారి దొరకలేదు. విశ్వేశ్వరిని

ధ్యానించింది. అమ్మా! నువ్వే దిక్కు. నా పాతివ్రత్యాన్ని కాపాడు. నీ పాదాలకు శిరసునువంచి మొక్కుతున్నాను.

నమః పద్మోద్భవే దేవి! నమః శంకరవల్లభే |

విష్ణుప్రియే నమో లక్ష్మీ ! వేదమాతః సరస్వతి

కామెంట్‌లు లేవు: