🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
ఇందాక అలా పనుండి పాట్నా లో ఉన్న వేదపాఠశాల కాంపౌండ్ లో ఉన్న SBI కి వెళ్లాను. లింకు ఫెయిల్ అవడంతో అలా బయటపడి వేదం వల్లె వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని *ఎందుకండీ ఇలా బట్టి వేయిస్తున్నారు, చేతికి పుస్తకం ఇస్తే చూసి జాగ్రత్తగా చదువుతారు కదా* అని అడిగా..
దానికి ఆయనిచ్చిన సమాధానం..
"నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన మహమ్మదీయ రాజు కాలంలో కాల్చివేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళీ ఆ వేదం విద్యను గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రూరంగా హింసించి చంపేయ్యడం జరిగింది!
ఇది ముందే గమనించిన *మన విద్యావేత్తలు వేదాన్ని ఆనాటినుండే కంఠస్తం చెయ్యడం అలాగే మరికొంత మందికి కంఠోపాఠం గా నేర్పడం మొదలు పెట్టారు - అలా చాలా వరకు వేదాధ్యయనం ముఖత గానే కొనసాగింది అందువల్లే వేదాన్ని కంఠస్థం చెయ్యడం అలవాటుగా మారింది*
4 వేదాలు నోటికి వచ్చిన వాడిని చతుర్వేది అని
3 వేదాలు వచ్చినవాడిని త్రివేది అని
2 వేదాలు వచ్చిన వాడిని ద్వివేది అని
1 వేదం నేర్చినవాడిని ఉపాధ్యాయ అని
శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి అని
మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని మిశ్రా అని
శాస్త్రీయ కర్మ విధి విధానాలను నేర్చిన వాడిని శర్మ అని ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది!"
*మరి.. ఇప్పుడు రాయచ్చు కదండీ..ఇప్పుడు మనం స్వతంత్రులం కదా?* అన్నాను.
ఆయన నవ్వేసి.. *ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని? గత 70 ఏళ్లుగా గమనిస్తున్నాను.. ఒక్కడంటే ఒక్క మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మీద దృష్టి పెట్టనేలేదు! - ఇప్పటికీ మనం బానిస రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే ఇతర మత గ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం లేదా ఇతరులకు ఇంకా భయపడుతూనే ఉన్నాం!* అన్నారు.
ఆయన మాటల్లో నిజం ఉందనిపించింది నాకు! మీరేమంటారు?
*(ఈ టపా..జాతీయ వాదుల సమాలోచన అనే గ్రూపు నుండి సేకరించింది)*
*హనుమంతు వెంకట రమణ మూర్తి*
*టెక్కలి, విశాఖపట్నం* *(బతుకు తెరువు కోసం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి