14, అక్టోబర్ 2022, శుక్రవారం

నా దేముడే గొప్ప

 

నా దేముడే గొప్ప 

ఇటీవల నేను యూట్యూబ్ లో వెతుకుతుంటే ఒక విచిత్రమైన వీడియో నా కంటికి కనపడింది అదేమిటంటే ఒక యెడారిమతం అతను చెపుతున్నాడు అతని మతంలో ఒకడే దేముడట అదేవిధంగా ఇంకొక ఎడారి మతానికి కూడా దేముడు ఒక్కడే అట కానీ హిందూ మతంలో వేలు, కోట్లమంది  దేముళ్ళట. ఇదెక్కడిది ఇట్లా ఎక్కడైనా ఉంటుందా అని మన హిందూ ధర్మాన్ని విమర్శిసిస్తున్నాడు.  అట్లా ఎంతోమంది మూర్ఖులు రోజురోజుకు హిందూ ధర్మాన్ని విమర్శించి వాళ్ళ మతమే గొప్పదని చెప్పుకొనే ప్రయత్నం చేస్తూ అమాయకులైన హిందువులను మతమార్పిడి చేస్తున్నారు,  చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ ఏదారిమతస్తులు ఎప్పుడు చెప్పేది ఒక్కటే మా దేముడే గొప్ప అని.  మరి మీ దేముడి గొప్ప ఏమిటయ్యా అంటే సమాధానం ఉండదు. 

అందరు తెలుసుకోవలసినది ఒక్కటే అదేమిటంటే హిందూ మతం కాదు, ఇది ఒక సనాతన ధర్మం.  అన్ని మాతాలకూ ఒక ప్రవక్త ఉంటాడు ఈ విషయం మనందరికీ తెలుసు.  మరి మీ మతాల లాగ హిందుత్వం కూడా మతం అయితే మరి హిందూ మతానికి ప్రవక్త ఉండాలి కదా కానీ ఎవరూ లేరే

మతగ్రంధం: ప్రతి మతానికి ఓక మత గ్రంధం ఉంటుంది దానిని వారు ప్రమాణంగా తీసుకొని అనుసరిస్తారు.  మరి హిందూ మతానికి మత గ్రంథం ఏది అంటే ఏ గ్రంధాన్ని చెపుతారు.  ఒక్క గ్రంధం అంటూ ఏది చెప్పలేరు. 

మతం అనేది ఒక ప్రవక్త తన అనుభవాలతో, అనుభూతులతో ఏర్పరచిన ఒక పద్దతి, విధానం.  కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవలసింది ఏమిటంటే మత ప్రవక్త లాగ ఏ ఒక్క వ్యక్తి హిందూ ధర్మంలో లేరు.  మన సనాతన ధర్మంలో వేలకొద్దీ మహర్షులు వారి వారి తపఃశక్తితో కనుగొన్న జీవన విధానమే హిందూ ధర్మం. 

దేవుడు కాపాడుతాడు: ప్రతి మతంలో ఒక్కటే చెప్పబడి ఉంటుంది అదేమిటంటే నిన్ను దేవుడు కాపాడతాడు అని. అలా భావించే ఆయా మతాల వారు వారి మత గ్రంధం లో పేర్కొన్నట్లు దేవతారాధన  చేస్తారు. కానీ హిందూ ధర్మంలో దేవుడు నిన్ను కాపాడుతాడు అని ఎక్కడా చెప్పలేదు. మన ధర్మంలో చెప్పింది ఒక్కటే అదేమిటంటే "ధర్మం నిన్ను కాపాడుతుంది" అది యెట్లా అంటే ధర్మాన్ని ఆచరించాలి, అప్పుడే ధర్మం నిన్ను కాపాడుతుంది. 

“ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః

తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్”– మనుస్మృతి

“చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపిన వాణ్ణి చంపుతుంది; రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించు వారిని రక్షిస్తుంది; కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి” ధర్మాచరణ అంటే ఏమిటి అనగా ప్రతివారు తనకు చెప్పబడిన కర్మలను చేయడం, నిషేధించిన  కర్మలు చేయకపోవటం మరియు చెప్పిన కర్మలను విస్మరించి, నిషేధించిన  కర్మలు చేయడం అనేది ధర్మానికి హాని కలుగ చేయటమే. 

చెప్పిన కర్మలు అంటే ఏమిటి అనగా మనకు వేదాలలో చెప్పిన పనులు వీటిని విహిత కర్మలు అని అంటారు.  వెడలు ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిని, పట్టి, స్థితిని పట్టి ఏమేమి కర్మలు చేయాలో తెలియజేశాయి. ఉదాహరణకు.  తల్లిదండ్రులను సేవించటం ఇది ప్రతి మానవుడికి చేయవలసిన కర్మ, అదేవిధంగా ఇతరుల తల్లిదండ్రులను గౌరవించ వచ్చు కానీ వారి సంతానం వారిని సరిగా చూడనంత మాత్రంన  ఇతరులు వారిని సేవించ వలసిన పని లేదు.  కేవలము వారి పుత్రుడు మాత్రమే వారిని సేవించాలి.  ఈ విషయంలో శ్రీ కృష్ణపరమాత్మ స్పష్టంగా తెలిపారు.

భగవద్గీత 3-35

“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

తాత్పర్యం

“ చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా, గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది ; స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే ; కానీ, పరధర్మం మాత్రం భయంకరమైనది. ”

వివరణ

“ స్వధర్మం ” అంటే “ ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో వున్నారో ఆ ఆత్మస్థాయికి తగ్గ ధర్మం అన్నమాట ” …“ పరధర్మం ” అంటే “ ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు ” అన్నమాట …మనలో సహజసిద్ధంగా ఉన్న అభిరుచి, వాసనలను అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది … అదే “ స్వధర్మం ” అవుతుంది. ఇతరులకు నిర్దేశించబడినవి,

మరి మనకు నిర్దేశించబడనిది అయినదే “ పరధర్మం. ” మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం … ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం … “ పరధర్మపాలన ” అవుతుంది. “ పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం ” సబబు కాదు … పులి జీవితంలా ‘నక్క జీవితం’ ఉంటే నక్క నష్టపోతుంది … ‘ నక్క దశ ’లో వున్నప్పుడు నక్కలానే జీవించాలి … స్వధర్మానికి వ్యతిరేకంగా ‘ ఓ నక్క ’ జీవించడానికి యత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పవు ! స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే ‘ ఒక్క నక్క జన్మ ’తోనే సరిపోతుంది ! ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది. పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది. ఒక యజమాని ఇంట్లో దొంగ ప్రవేశించడం చూసినా, కుక్క ఊరుకోవడంతో … గాడిద … కుక్క పని తాను చెయ్యబోయి … ఓండ్రపెట్టి …యజమానితో చావుదెబ్బలు తిన్నది. మన స్థాయి ఎదిగినప్పుడు ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు. కానీ, ముందే దానికోసం ప్రాకులాడడం …

“ రెక్కలు రాకుండానే ఎగరడానికి ప్రయత్నించడం ” వంటిది … క్రిందపడి కష్టాలు కొని తెచ్చుకుంటాం. “ గురువు చేసినట్లు ” చెయ్యొద్దు …

“ గురువు చెప్పినట్లు ” చెయ్యాలి ! విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం … దానిని సరిగ్గా ఆచరించడం ధర్మం. జ్ఞానం ఉంటేనే ధర్మం తెలుస్తుంది. ధర్మం తెలిస్తేనే అనుష్ఠానం సరిగ్గా చేస్తాం. ధర్మమే శాశ్వతం … ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదలకూడదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు … అది విశిష్టగుణ రహితం అయినప్పటికీ … “ అల్పగుణి ” అయినప్పటికీ … దానినే అనుసరించాలి … “ జయ విజయులు ” తమ అల్పగుణాన్ని భయరహితులై, సంకోచరహితులైఆశ్రయించి మూడు జన్మలలోనే కడతేరినట్లు పురాణగాథ వున్నది కదా ! వుండవలసింది మరి భయరహితం … సంకోచరహితం … సదా, సర్వత్రా స్వధర్మాశ్రయమే శరణ్యం ! స్వధర్మపాలనలో మరణం సంభవించినా మేలే ! అదేవిధంగా పాప, పుణ్య విచారణ చేయవలసిన ధర్మం ప్రతి ఒక్కరి మీద వున్నది.

పాపం అనగా ఏమిటి: పాపం అనగా నీ యెడ వేరే వారు ఏ పని చేస్తే నీ మనస్సు, శరీరం బాధపడుతుందో ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయటాన్ని పాపంగా పరిగణించాయి మన శాస్త్రాలు.  పాప కార్యాలు చేయటం వలన వచ్చే ఫలమును, పాప ఫలము అంటారు.

పుణ్యం అనగా ఏమిటి: పుణ్యం అనగా నీ యెడ వేరే వారు ఏ పని చేస్తే నీ మనస్సు, శరీరం ఆనంద పడుతుందో ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయటాన్ని పుణ్యం పరిగణించాయి మన శాస్త్రాలు.  పుణ్యం కార్యాలు చేయడం వలన వచ్చే ఫలము, పుణ్యం ఫలము అంటారు.

ఒకరు చేసే ప్రతి కర్మ కూడా పాప, పుణ్యాలలో ఏదో ఒకటి అవుతుంది.  దీని పర్యవసానంగా పాప, పుణ్య ఫలితాలు కలుగుతాయి.  వాటిని జీవుడు తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది.

పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలాన్ని పొంది ఈ జన్మ వీడిన తదుపరి వచ్చే జన్మ ఇప్పటి జన్మ కన్నా ఉన్నతమైన జన్మ కలుగుతుంది.  కాబట్టి అందరూ సదా పుణ్య కార్యాలు చేస్తూ పాప కార్యాలకు దూరంగా ఉండవలెను.

ధర్మో రక్షతి రక్షితః

మీ

భార్గవ శర్మ (న్యాయవాది)

గమనిక:

మీ వ్యాపారాభివృద్ధి చేసుకోండి.  ఏ వ్యాపారం చేసినా కూడా పబ్లిసిటీ చాలా ముఖ్యం.  పబ్లిసిటీకి ఎంతో ఖర్చు చేస్తుంటారు.  కొద్ది ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ కావాలంటే అందరూ ఇష్టపడతారు.  మీలో ఎవరైనా ఇలా కావాలనుకుంటే ఫై వ్యాసాన్ని కరపత్రంగా అచ్చు వేయడం(వ్యాసకర్త అనుమతి తో)  క్రింద మీ వ్యాపార ప్రకటన ఉదా: మీరు పురోహితులు ఎలక్ట్రిషనో, ప్లంబరో, లేక ఇతర వ్యాపారం ఏదయినా చేస్తున్నారనుకోండి. ఆ వివరాలు అచ్చువేయించిన కరపత్రాలను మీకు సమీపంలో ఉన్న దేవాలయంలో పంచి పెడితే అది చదివిన వారికి హిందుత్వం మీద అవగాహన వస్తుంది అదే విధంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి దోహద పడుతుంది.  కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

కామెంట్‌లు లేవు: