25, అక్టోబర్ 2022, మంగళవారం

వైరభక్తి కూడా ఒక్కటి

 నరక చతుర్దశి - దీపావళి


దీపావళి నరక చతుర్దశి రెండు సమానమే. ఇది భారతదేశం అంతటా జరుపుకునే జాతీయ పండగ. ఉత్తర భారత దేశంలో దీనిని ఎక్కువగా దీపాల పండుగ లాగా ఇళ్ళను దీపాల వెలుగులో నింపి చేసుకుంటారు. దక్షిణాపథంలో వేకువనే నువ్వుల నూనెతో తలంటు పోసుకుని కొత్త బట్టలను కట్టుకుంటారు. దీనివల్ల శ్రేయస్సు కలిగి జీవితంలో పడుతున్న కడగండ్ల నుండి విముక్తి కలుగుతుంది. 


అమావాస్యకు ముందురోజైన చతుర్దశి నాడు సూర్యుడు తులా రాశిలో ఉండగా శ్రీమహాలక్ష్మి సాన్నిధ్యం వల్ల నువ్వుల నూనె పవిత్రమవుతుంది. నీటిలో గంగా సాన్నిధ్యం వల్ల మొత్తం నీరంతా గంగాజలంతో సమానం అవుతుంది. పసివాడి నుండి సన్యాసి వరకు, ధనికుడి నుండి బిదవాని వరకు ప్రతి ఒక్కరూ తైలాభ్యంగన స్నానము చెయ్యాలి. పరమ సంతోషంతో భగవంతుణ్ణి ఆరాధించి ప్రతి చోట పార్టి మూలలోనూ దీపములను వెలిగించాలి ఈ దీపావళి (దీపముల యొక్క వరుస) నాడు.


భూదేవి తన కుమారుడైన నరకాసుర సహారం జరిగినప్పుడు శ్రీకృష్ణున్ని అడిగిన వరం ఇదే. “నా కుమారుని మరణం వల్ల నాకు కలిగిన ఈ దుఃఖం, ఈనాడు ప్రపంచంలోని అందరి సుఖ సంతోషాల వల్ల తిరిపోవాలి” అని కోరింది ఆ వీరమాత. అన్ని పండుగలు ఉత్సవాలకెల్ల దీపావళి చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే, వ్యక్తిగతంగా రెండు హృదయాలకు (భూదేవి, నరకాసురుడు) కలిగిన బాధ వల్ల ప్రపంచానికి కలిగిన హర్షాతిరేకమే ఈ దీపావళి. చేసిన తప్పులకు ప్రాణాలు వదిలిన ఆ రాక్షసుడు, కన్న కొడుకును కోల్పోయి పుత్రశోకంతో ఉన్న ఆ తల్లి  ఇద్దరి కోరిక ఎంతో ఉన్నతమైనది.


[భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎన్నో మార్గములు. అందులో వైరభక్తి కూడా ఒక్కటి. శ్రీ కృష్ణావతారంలో కంస, శిశుపాల, పౌండ్రక, నరకాసుర ఇలా ఎందరినో పరమాత్మ తనలో ఐక్యం చేసుకున్నారు. ఎలా వెళ్ళినా ఆయన పాదలచెంతకే, కాని వైరభక్తి వల్ల బ్రతికినంతకాలం ప్రశాంతత లేక భయంకరమైన మరణ వేదనను అనుభవించి చనిపోతారు. దుర్మార్గులు రాక్షసులుగా మిగిలిపోతారు. వారు నడిచిన మార్గం అధర్మంతో కూడుకున్నది కాబట్టి అడి ఆచరణ యోగ్యము కాదు]


--- kamakoti.org నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: