25, అక్టోబర్ 2022, మంగళవారం

అందరూ అసురస్వభావం కలవారు

 ** బహుశా 1987 లో అనుకుంటా...మా తాతపాదుల వారిని అడిగి ఉంటా... నరకచతుర్దశి అంటే ఏమిటని..? 

**కృష్ణుడు ఉన్న ద్వాపర కాలం కంటే ముందు ఈ పండుగ తలంట్లు లెవా .. ? అని...అప్పుడు మా తాత కొన్ని అంశాలు చెప్పి...నా దేహం లోని సందేహాలు తీర్చే ప్రయత్నం చేశారు...


**నరకుడు ఒక్కళ్ళు కారని... ఇరవై నాలుగు లేక ఇరవై ఐదు మంది రాజులు ఒకే వంశానికి చెందిన వారి వంశ నామం నరక యని...అందరూ అసురస్వభావం కలవారు కారని...చివరి నరక యను వంశ నామం కలవాడే అసురస్వభావం కలవాడవుట వలన నరకాసురుడు అని పిలువబడ్డాడని...

మా మాతామహుల  మరియు వారి..మేనమామ గరై నట్టి నా పితమహులైన గణపతిశాస్త్రీ గారి ద్వారా నా చిన్నప్పుడు తెలుసుకున్నా...!


** బహుశా కాళికాపురాణం అనే పేరు తో మా తాత చెప్పిన విషయాలు... ఆయన గతించి, పదహరేళ్లు,అవుతున్నా... నాకు చెప్పినది...పాతికేళ్ల క్రితమే అయినా మా తాతలను తలచిన మరుక్షణమే నాకా... రోజులు కళ్ల ముందు గోచరిస్తున్న ట్లు గా ఉంది..

.

** నరకచతుర్దశి యనగా నరకం నుండి దుర్గతి నుండి తరింపచేయు చతుర్దశి యని సనాతన భారతీయ గ్రంథాలు చెపుతున్నాయి..

శ్లో|| ఆశ్వయుకృష్ణపక్షస్య,

   చతుర్దశ్యాం విదూదయే,

   తిలతైలేన కర్తవ్యం

    స్నానం నరక భీరుణా...

అని పద్మపురాణం లో చెప్పబడింది. "నరకము వలన భీతిల్లు వారు అనగా భయపడు వారు ఆశ్వయుజ కృష్ణ బహుళ చతుర్దశి నాడు చంద్రోదయ కాలమున కు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయవలెనని దీని అర్ధం.


శ్లో|| " కర్తవ్యం మంగళ స్నానం నరైర్నిరయ భీరుభిః "


 అనే" కాలాదర్శం " లోని అంశం ద్వారా..నరకశబ్ద పర్యాయ పదమగు నిరయ శబ్దము ను ఉదహరించబడుట ద్వారా...


నరకచతుర్దశి లోని నరక శబ్దమునకు  నరకమని యర్థమే కానీ నరకాసురుడని..కాదు..

 ఎందుకనగా..నరక "భీతి" గలవారు ఆచరింపవలసినది విధించు విధి అయిన తైలాభ్యంగన స్నానము నరకాసురుడు గతించిన కాలము వారికి అన్వయింపలేము  కదా !...


** ఈ విధి ని లోక ప్రాచుర్యం పొందిన  నరకాసురుడి సంహారం ముందు నుండే వాడుకలో ఉండేది..కాకుంటే కృష్ణపరమాత్మ సత్యభామా సమేతుడై  ,లోకకంఠకుడైన నరకుని సంహరించిన రోజు కూడా ఈ రోజే అవడం మూలానా, నరకచతుర్దశి లోని నరక పదానికి..నరకాసురుడని భ్రమించి భావించడంజరిగి ఉండవచ్చు...

ఆ తియ్యని జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని...

ఇలా....మీ తో....

కామెంట్‌లు లేవు: