🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
*మన మహర్షుల చరిత్రలు*..
*🌹ఈరోజు 60,వ మృకండు మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*
🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
🍁మనం మృకండు మహర్షి గురించి తెలుసుకుందాం .
మృకండు మహర్షి తండ్రి మృగశృంగ మహర్షి తల్లి పేరు సువృత్త .
☘️మృగశృంగ మహర్షికి నలుగురు భార్యలు , వారు నలుగురు మహర్షులను సేవలతో సంతోషంగా సేవలు చేస్తూ ఉండేవారు.
అతడును వారిపట్ల సమాన ప్రేమను చూపెడుతూ ఆనందపరిచాడు.
☘️వారు నలుగురు ఒక్కసారిగా గర్భము లు ధరించి నలుగురు పుత్రులను కన్నారు. అందులో సువృత్త కుమారుడే మృకండుడు.
🍁మృకండు మహర్షి నాలుగు వేదాలు సకల విద్యలు నేర్చుకుని , చక్కటి వినయ విధేయతలున్న వాడిగా పేరు తెచ్చుకున్నాడు .
☘️మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల
🍁 మృగములు వచ్చి తమ కండుయాన్ని (దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం) తీర్చుకొనేవి.
☘️ మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు.
🍁 మృకండుడు పెద్దవాడయ్యాక ముద్గల మహర్షి కూతురు మరుద్వతినిచ్చి పెళ్ళి చేశారు .
☘️వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి
🍁వారణాశి కి తపస్సు చే..యడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు.
అన్ని తీర్థాలు తిరుగుతూ తల్లులతో సహా కాశీకి చేరుకున్నాడు .
☘️ అక్కడ గంగాస్నానం చేసి అందరూ డుంఢి వినాయకుణ్ణి దర్శించుకుని ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు .
🍁 ఆ శివలింగాన్ని చూసిన వాళ్ళకి కోరికలునెరవేరేలాగగృ శివుడి అనుగ్రహం ఉంది . మృకండు మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాన్ని మృకండీశ్వరుడు అంటారు .
☘️ ఆలింగాని దర్శించిన వాళ్ళకి తలచిన పన్లు నెరవేర్తాయి . అలాగే మరుద్వతీశ్వరుణ్ణి దర్శిస్తే జన్మరాహిత్యం కల్గుతుంది .
🍁 మృకండుడి తల్లుల పేర్ల మీద ప్రతిష్ఠించిన శివలింగాల్లో సృవ్వతేశ్వర దర్శనం మంచి శీలాన్ని ఇస్తుంది .
☘️ ఏ పని తలపెట్టినా విఘ్నం లేకుండా చేస్తుంది . కమలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే కావాలనుకున్న పన్లు చక్కగా జరుగుతాయి .
🍁విమలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే విమల జ్ఞానం వస్తుంది . ఇలా ఒక సంవత్సర కాలం మృకండుడు కాశీలోనే వున్నాడు .
☘️తల్లులు పెద్దవాళ్ళయిపోవడం వల్ల అక్కడే మరణించారు . మరుద్వతీ మృకండులు కాశీలోనే ఉండిపోయి గంగాస్నానం చేసి శివుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతున్నారు .
🍁సంతానం కోసం మృగండు మహర్షి , శివుడు గురించి ఘోర తపస్సు చేస్తాడు
మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని పరీక్ష చేయడానికి
☘️ మహర్షి నీకు ఏం కావాలనడిగాడు . పిల్లలు కావాలి అనుగ్రహించమన్నాడు మృకండ మహర్షి .
🍁 చాలా గుణవంతుడు విద్యావంతుడయి పదహారేళ్ళే బ్రతికే కొడుకు కావాలా ? గుణం లేనివాడు చదువు రాని వాడు చిరంజీవి కావాలా ? అనడిగాడు శివుడు .
☘️మృకండు మహర్షి ఆయువు తక్కువున్నా ఫర్వాలేదు . విద్యావంతుడు , సుగుణవంతుడు కావాలన్నాడు . అలాంటి కొడుకు వల్లే కదా తల్లిదండ్రులకి ఆనందం ...... శివుడు అనుగ్రహించాడు .
🍁కొంతకాలం తర్వాత మృకండు మహర్షికి కొడుకు పుట్టాడు . వెంటనే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది . దేవదుందుభులు మ్రోగాయి . నదులు నిండుగా ప్రవహించాయి .
☘️ వ్యాసభగవానుడు శిష్యుల్తో సహా వచ్చి , దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా ఆ పిల్లవాడికి నామకరణం చేశాడు . ఆ పిల్లవాడి పేరు ' మార్కండేయుడు ' .
🍁 ఆ పిల్లవాణ్ణి కన్న మరుద్వతీ మృకండు మహర్షుల్ని అందరూ అభినందించాడు . ఎవరికీ చూడడానికి దొరకని వ్యాసభగవానుడు వచ్చేసరికి,
☘️ మృకండుడు ఆనందం పట్టలేక ఆయన పాదాల్ని ఆనందభాష్పాల్తో కడిగి కృతజ్ఞత చెప్పుకుని ఆయన్ని పూజించి , గౌరవించి , సన్మానించి పంపాడు .
🍁 మార్కండేయుడు పెరిగి పెద్దవాడై తల్లిదండ్రులు చెప్పినట్లు తపస్సు చేసి చిరంజీవిగా వరం పొంది తల్లిదండ్రుల్ని ఆనందపరిచాడు .
☘️ఇదండి మృకండు మహర్షి గురించి మనకు అందిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి!
*సేకరణ:* శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి