సజ్జన సాంగత్యం
ఒక రాజు నిండా ఆభరణాలు ధరించి ఒక అడవిలో ప్రయాణిస్తున్నారు ఆ అడవిలో ఒక చెట్టు పైన ఒక చిలుక ఆ రాజుని చూసి అందరూ రండి బాగా బంగారు ఆభరణాలు డబ్బులు ఉన్న మనిషి వస్తున్నాడు రండి రండి అని అక్కడ ఉన్న బందిపోటులకు తెలియజేసింది.అప్పుడు బందిపోటు రాజును వెంబడించాడు. .
రాజు ప్రాణ భయంతో పరుగు పెట్టాడు..తన పరివారాన్ని వీడి వేగంగా గుర్రం మీద వెళ్ళినాడు. కొంత దూరం వెళ్లిన తరువాత బందిపోటులు ఇక రారు అని అనుకోని ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా.... ఆ చెట్టు పైన ఇంకో చిలుక రాజుని ఉద్దేశించి ఇలా అన్నది అయ్యా ఈ పక్కన ఒక ఆశ్రమం ఉంది. అక్కడి గురువుగారు చాలా మంచివారు మీకు మంచి భోజనం పెడుతారు. అంతేకాదు వారి సాన్నిధ్యంలో మీకు రక్షణ కల్గుగుతుంది అని చిలుక చెప్పిన మాటలను విని రాజు అక్కడ వున్న ఆశ్రమం దగ్గరకు వెళ్తాడు. వెళ్ళగానే అక్కడి శిస్యులు రాజుగారిని ఆదరించి మంచి నీళ్ళ ఇచ్చి ,రుచికరమైన భోజనాన్నిపెట్టి ,సేధ తీసుకోవాటానికి తగిన ఏర్పాట్లు చేసి స్వేద తీర్చుకొని స్వస్థత చేకూరిన తరువాత వారి గురువుగారి వద్దకు తీసుకొని వెళ్లారు. అప్పుడు రాజు గురువు గారితో ఇలా అన్నాడు.
మహానుభావా మొదలు నేను బయలుదేరినప్పుడు ఒక చిలుక నా గూర్చి బందిపోటులకు సమాచారం ఇచ్చి నాకు ప్రాణభయాన్ని కలిగించింది. కానీ మీ ఆశ్రమ సమీపంలో వున్న రెండవ చిలుక మీ ఆశ్రమ సమాచారాన్ని ఇచ్చి నాకు ప్రాణ రక్షణకు మార్గం చూపించింది. రెండు చిలుకలే కదా వాటి గుణం లో ఎందుకు ఇలా మార్పుగా వున్నాయి అని అన్నాడు.
దానికి గురువు గారు ఇలా చెప్పారు. రాజా మీరన్నట్లు రెండు కూడా చిలుకలే వాటికి నిజంగా మనుషులకు ఉన్నట్లు రాగ ద్వేషాలు వుండవు. కేవలము అవి నేర్చుకున్న వాటినే పలుకుతాయి. మొదటి చిలుక బందిపోట్ల మధ్యలో పెరిగింది.కాబట్టి వారు నేర్పిన పలుకులే పలికించి ఇక రెండవ చిలుక మా ఆశ్రమంలో ఆశ్రమంలో పెరిగింది. ఇక్కడి పలుకులే పలికింది. ఇదంతా సాంగత్య మహత్యం అని అన్నారు గురువు గారు. అంటే మనం ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే అలాంటి గుణాలే కలుగుతాయి/అలవడతాయి అని అన్నారు గురువు గారు. ఏ ఇంటి చిలుక ఆ ఇంటి పలుకు పలుకుతుంది అంటే ఇదే అన్నది ఇదే అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి