18, అక్టోబర్ 2020, ఆదివారం

**దశిక రాము**


**దేవీ నవరాత్రులు*  


2వ రోజు :

 శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి.


**హ్రీంకారాసన గర్భితానల శిఖాం**

*సౌ:క్లీం కళాంబిభ్రతీం*

**సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం*

**త్రినేత్రోజ్జ్వలామ్**

**వందే పుస్తక** *పాశమంకుశధరాం*

**స్రగ్భూషితాముజ్జ్వలాం**

**తాంగౌరీం త్రిపురాం** 

**పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్" **


త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.


అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. 


షొడశ విద్యకు ఈమే అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము.


త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.


త్రిపుర సుందరి అంటే మనలోని ముాడు అవస్తలు జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!

ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత!


ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తు బాలగా.అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.


అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే ఙ్ఞ్నానము కలిగి తానె శివ స్వరూపము తో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.


బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది. అది లలితా సహస్రంలో కూడా మనకు వస్తున్నది. భండాసురునియొక్క పుత్రులు ముప్ఫైమంది. వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపురసుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రథం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథం. ఆ ఒక్క తల్లి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు. ఇదివరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు. అంత భయంకరమైన భండ పుత్రులు. వారందరినీ ఒక్క తల్లే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లియొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువలేదు. బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనపడుతున్నది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాసనిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షించారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలా త్రిపుర సుందరీ మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశిని ఆరాధించడానికి అర్హులవుతారు. శ్రీవిద్యలో ఒక భాగంగా ఉన్న బాలా విద్య ఒక ప్రత్యేకవిద్యగా కూడా చాలామందిచేత ఆరాధింపబడుతోంది. ఈరోజు బాలా మహా త్రిపురసుందరీ రూపంగా ఈ రోజు చేసి ఇక్కడనుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తున్నాం. బాలా భావనతో కుమారీ పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏవండీ ఒక్కరోజు ఒక్కసారి పూజచేస్తే చాలు కదా! తొమ్మిది రోజులు చేయాలా? అంటే చేయాలిట. బాల పూజ తొమ్మిదిరోజులూ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది.


మొదటిరోజు బాల పూజా ఫలితం – “శతృక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై” అన్నారు. – శతృనాశనము, ధనాన్ని, ఆయుష్షునీ, బలాన్ని వృద్ధి చేయడం అనేది మొదటిరోజు చేసే కుమారీపూజయొక్క ఫలం.


శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం;


అరుణకిరణ జాలైః అంచితావకాశా

విధృత జపపటీనా పుస్తకాభీతి హస్తా

ఇతర కర వరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థా

నివసతు హృది బాలా నిత్య కళ్యాణ శీలా

(ఎర్రని కిరణాలను వెదజల్లుతూ..జప మాల, పుస్తకము, వరద మరియు అభయ హస్తాలతో విరాజిల్లుతూ..విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి నిత్యమూ నా హృదయమునందు ఉండుగాక)


బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే

కామేశ్వర్యై చ ధీమహి


తన్నోబాలా ప్రచోదయాత్ ||


లోకా సమస్తా సుఖినోభవంతు..!!


శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి


ఓం కళ్యాణ్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం బాలాయై / మాయాయై నమః

ఓం త్రిపురసుందర్యై నమః

ఓం సుందర్యై నమః

ఓం సౌభాగ్యవత్యై నమః

ఓం క్లీంకార్యై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం హ్రీంకార్యై నమః

ఓం స్కందజనన్యై నమః

ఓం పరాయై నమః

ఓం పంచదశాక్షర్యై నమః

ఓం త్రిలోక్యై నమః

ఓం మోహనాధీశాయై నమః

ఓం సర్వేశ్వర్యై నమః

ఓం సర్వరూపిణ్యై నమః

ఓం సర్వసంక్షభిణ్యై నమః

ఓం పూర్ణాయై నమః

ఓం నవముద్రేశ్వర్యై నమః

ఓం శివాయై నమః

ఓం అనంగకుసుమాయై నమః

ఓం ఖ్యాతాయై /అనంగాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః

ఓం జప్యాయై నమః

ఓం స్త్వ్యాయై / శ్రుత్యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం నిత్యక్లిన్నాయై నమః

ఓం అమృతోద్బభవాయై నమః

ఓం మోహిన్యై నమః

ఓం పరమాయై నమః

ఓం ఆనందదాయై నమః

ఓం కామేశ్యై నమః

ఓం తరణాయై నమః

ఓం కళయై / కళవత్యై నమః

ఓం భగవత్యై నమః

ఓం పద్మరాగకిరీటన్యై నమః

ఓం సౌగంధన్యై నమః

ఓం సరిద్వేణ్యై నమః

ఓం మంత్రిణ్యై నమః

ఓం మంత్రరూపిణ్యై నమః

ఓం తత్త్వత్రయ్యై నమః

ఓం తత్త్వమయ్యై నమః

ఓం సిద్దాయై నమః

ఓం త్రిపురవాసిన్యై నమః

ఓం శ్రియై /మత్యై నమః

ఓం మహాదేవ్యై నమః

ఓం కౌళిన్యై నమః

ఓం పరదేవతాయై నమః

ఓం కైవల్యరేఖాయై నమః

ఓం వశిన్యై / సర్వేశ్వర్యై నమః

ఓం సర్వమాతృకాయై నమః

ఓం విష్ణుస్వశ్రేయసే నమః

ఓం దేవమాత్రే నమః

ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః

ఓం కింకర్యై నమః

ఓం మాత్రే నమః

ఓం గీర్వాణ్యై నమః

ఓం సురాపానామోదిన్యై నమః

ఓం ఆధారాయై నమః

ఓం హితపత్నికాయై నమః

ఓం స్వాధిస్ఠానసమాశ్రయాయై నమః

ఓం అనాహతాబ్జనిలయాయై నమః

ఓం అజ్ఞాయై నమః

ఓం పద్మాసనాసీనాయై నమః

ఓం విశుద్దస్థలసంస్థితాయై నమః

ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః

ఓం సుషుమ్నాయై నమః

ఓం చారుమధ్యాయై నమః

ఓం యోగేశ్వర్యై నమః

ఓం మునిద్యేయాయై నమః

ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్రచూడాయై నమః

ఓం పురాణాగమరూపిణ్యై నమః

ఓం ఐంకారారాదయే నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం పంచప్రణవరూపిణ్యై నమః

ఓం భూతేశ్వర్యై నమః

ఓం భూతమయ్యై నమః

ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః

ఓం షోడశన్యాసమహాభూషాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం దశమాతృకాయై నమః

ఓం ఆధారశక్యై నమః

ఓం తరుణ్యై నమః

ఓం లక్ష్యై నమః

ఓం త్రిపురభైరవ్యై నమః

ఓం శాంభవ్యై నమః

ఓం సచ్చిదానందాయై నమః

ఓం సచ్చిదానందరూపిణ్యై నమః

ఓం మాంగళుఅదాయిన్యై నమః

ఓం మాన్యాయ్యై నమః

ఓం సర్వమంగళాకారిణ్యై నమః

ఓం యోగలక్ష్మ్యై నమః

ఓం భోగలక్ష్మ్యై నమః

ఓం రాజ్యలక్ష్మ్యై నమః

ఓం త్రికోణగాయై నమః

ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః

ఓం సర్వసంపత్తిదాయన్యై నమః

ఓం నవకోణపురావాసాయై నమః

ఓం బిందుత్రయసమన్వితాయై నమః

 


🌹శ్రీ మాత్రే నమః🌹

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: