*. శ్రీశరన్నవరాత్రశుభాకాంక్షలతో నాచే రచింపబడినటువంటి**. *శ్రీశారదాంబాsష్టకమ్*** ******రోజుకి ఒక శ్లోకము*******
(1)శృంగేరీపురవాసినీం సురవరైస్సంపూజితాం సర్వదా,
శ్రీమచ్ఛంకరభారతీగురువరైస్సంసేవితాం వై సదా |
తుంగానీరసమర్చితాం సురనుతాం సద్విద్యదాం పావనీం, వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసంపూరణీమ్ ||
భావం - శృంగేరీపురవాసిని అయినటువంటి, దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడేటటువంటి,శ్రీశంకరభారతీగురువర్యులచే ఎల్లప్పుడూ సేవింపబడేటటువంటి, పవిత్రతుంగానదీజలములచే అర్చింపబడేటటువంటి, దేవతలచే స్తుతింపబడేటటువంటి, సద్విద్యను ప్రసాదించేటటువంటి, పావని అయినటువంటి, వేదములచే స్తోత్రము చేయబడేటటువంటి, సర్వార్థములను పూరించేటటువంటి, శారదా మాతను నమస్కరించుచున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి