18, అక్టోబర్ 2020, ఆదివారం

అన్యాయంగా

 1 అన్యాయంగా 

హింసచేస్తూ డబ్బులు 

సంపాదించే వారితో 

బలవంతంగాకోరికలు అనుభవించే వారితో 

దొంగతనాలు చేసేవారితో 

సాంగత్యం చేయకూడదు వీరుఅధములు

వీరు రెండో దశకు రావాలి

.

2 కేవలం డబ్బులు సంపాదించేందుకే పనులు చేసేవారి గురించి కేవలం తినడానికే బ్రతికినవారి గురించి ఎక్కువ ఆలోచించకూడదు వీరిని వదిలేయాలి

తినడానికి కాకుండా పనిచేస్తూ డబ్బులు ఆశించని వారి గురించి అయితే అప్పుడు ఆలోచించాలి 

వీరు మూడో దశకు రావాలి

.

3 ధర్మంగా జీవనం గడుపుతూ పరోపకారం చేస్తూ ఆధ్యాత్మిక చింతన లో ఉన్న వారి సాంగత్యం చేయాలి అలా అయితే ఒక మెట్టు ఎక్కుగలుగుతారు

వీరు నాలుగో దశకు రావాలి

.

4 కర్మ ఉపాసన మానేసి జ్ఞానఉపాసన చేయాలి 

జ్ఞాన ఉపాసన మానేసి తత్వ విచారణ చేయాలి 

తత్వ విచారణ చేస్తూనే సత్యాన్వేషణ చేయాలి 

సత్యాన్ని తెలుసుకొని జన్మరాహిత్యం చేసుకోవాలి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి 

.

5. మీరు బ్రహ్మమై ఉన్నారు కానీ 

అనుభవపూర్వకంగా మీకే తెలిసివస్తుంది 

అప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి అంటారు




.

కామెంట్‌లు లేవు: