18, అక్టోబర్ 2020, ఆదివారం

 మిత్రులకు




జగదంబ విశ్వపాలిని మాతకు నా అక్షర పుష్పాంజలి


సీసము:-


కాంచీపురస్థితాం, కామేశ్వరప్రియాం


      కామేశ్వర మహిషీం, కామదాయి,


చంద్రశేఖర మానసాహ్లాద కారిణీం,


     కామకోటి స్థితాం, కమలనేత్రి,


పరమహంస హృదయ పంజరకేకినీం,


      చంద్రశేఖర సేవ్య చరణయుగళ,


ఇక్షుకోదండ మండిత కరీం, శ్రీకరీం,


       మాతంగ కన్యాం నమామి దేవి


తే!!గీ!!


అఘములు నశింపజేయుమమ్మా యటంచు

నీదు పాదముల బడి, నే  నిలచినాడ,.

పాలదేల్తువో నీటనో భారమీదె

కాంచిపురవాసి కామాక్షి గావుమమ్మ

కామెంట్‌లు లేవు: