*ఖాళీతత్త్వరహస్యం*
🕉️🌞🌎🏵️🌼🚩
*వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.*
*అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.*
*అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు.* *అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.*
*రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు.* *అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.*
*ఒకరు గురువుగారిని అడిగారు దైవీశక్తిని నేను చవిచూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి* *గురువుగారు ఇలా చెప్పారు-*
*500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.నీ జేబులో* *ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.*
*ప్రత్యక్షానుభవం కలుగుతుంది.*
*కోటి ఆధ్యాత్మికగ్రంథాలు* *చదివినా కలగని అనుభవం,* ఈ *ఒక్క పని *చేయడం వలన కలుగుతుంది...అన్నారు.*
*అతడు నవ్వుతూ ఓ* *హాస్యకథలాగా విన్నాడేగానీ, ప్రయత్నం* *చేయలేకపోయాడు.*
*ఈ ఘట్టం విని అతని స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం* *చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు.*
*అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్షం చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన* *శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా*
*ప్రయత్నం చేసి దైవీశక్తిని అనుభవించాడు.*
*తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు..*
*కొందరు "అతడు* *పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు...*
*కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు.*
*అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక.*
*వాస్తవానికి ప్రతి ఒక్కరు ఈ భూమ్మీదకు దిగంబరంగానే*
*వస్తారు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు..*
*తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను,* *అనుభవాలను ఉచితంగానే పొందుతారు...తిరిగి అందరినీ, అన్నింటినీ, చివరకు తనువును* *కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతారు.*
*" ఖాళీ" అవడం తథ్యం....*
*కాబట్టి అన్నీ ఉన్నప్పుడు* *కూడా "ఖాళీ"గా ఉండడమే*
*గురువుగారు చెప్పిన* *"మెలకువలో నిద్ర".*
*భగవద్గీతలో చెప్పినట్టు-* *"అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."*
*నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.*
*"ఖాళీ"గా ఉండడం. అదే* *యోగనిద్ర.*
*భగవద్గీత చరమశ్లోకంలో-
సర్వధర్మాన్* *పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు.*
*సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నారు.*
*ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.*
*"ఖాళీ" అనేది పరానికి సంబంధించినది.*
*శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.*
*కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు,*
*అర్థరాత్రి... ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని)* *అంధకారాన్ని(అభేదాన్ని)*
*ఆస్వాదించడమే కాళీమాత దర్శనం.*
*పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.*
*కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.*
*వ్యక్తిత్వభావన "ఖాళీ"* *అయిపోవడమే భక్తియోగం.*
*అహమిక "ఖాళీ"* *అయిపోవడమే జ్ఞానయోగం.*
*నిజానికి తాను "ఖాళీ" అయిపోతే.... ఆ ఖాళీ ఖాళీగా ఉండదు... ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.*
ఇదే *"ఖాళీతత్త్వరహస్యం".*
*అదే ఇది.... ఎవరూ లేకపోవడమే దేవుడు* *ఉండడం. ఏమీ* *తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం. ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.*
*నేను చేస్తున్నాను అనేది మన బ్రమ అదే మన కర్మ కు మూలం. అలా కాకుండా ఈ జగత్తు మొత్తం* *జగన్మాత(ఖాళీ)*
*నడుపుతోంది. అని అనుకుంటే*
*అది దైవ దర్శనం మార్గం* *అవుతుంది మన ప్రయాణం శక్తి (ఖాళీ) తో కూడి చక్కగా సాగిపోతుంది అదే ఖాళీ తత్వ మార్గం. ఈ మార్గం కర్మలకు దూరంగా వున్న సర్వ సంతోషాల నిలయానికి*
*చేరుకోవడానికి* *సహాయపడుతుంది. ఆ సంతోషి మాత దర్శనం మనకు లభిస్తుంది.*
*తింటేనే రుచి* *తెలుస్తుంది,అనుభవంతోనే అమ్మ (ఖాళీ) గొప్పతనం తెలుస్తుంది.*
.సేకరణ
🕉️🌞🌎🏵️🌼🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి