విజయాన్నిచ్చే బాల త్రిపుర సుందరి దేవి స్తోత్రం
అందరిలోను దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కన్పిస్తుంది.
అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తినుంచి పెద్ద శక్తివరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి ఆరాధనతో మొదలవుతుంది.
త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.
అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది.
కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం నితంబ జిత భూధారం సురనితంబిని సేవితాం నవంబురుహ లోచనం
అభినవాంబుదా శ్యామాలాం త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే
అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది.ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది.ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.
🙏 శుభోదయం 🙏
మీ లయన్ రవిప్రకాష్
🌹🌼🌸🌼🕉️🌼🌸🌼🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి