తల్లిపాలలో కలుగు దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు - 4 .
అంతకు ముందు పోస్టులలో వాత , పిత్త , కఫాల వలన తల్లిపాలు దోషం పొందినపుడు వాటిని సేవించిన శిశువుకు కలుగు దోషాల గురించి మీకు వివరించాను. ఇప్పుడు చికిత్సల గురించి మరియు తీసుకోవలసిన ఆహారం గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను.
స్తన్యము వాతం వలన దోషము పొందినపుడు చేయి చికిత్సలు -
* వాతము వలన స్తన్యము రుచి మారినచో ద్రాక్ష , యష్టిమధుకం ( అతిమధురం ) , సుగంధిపాల , క్షీరకా కోళి వీటిని సమానంగా తీసుకుని మెత్తగా నూరి గోరువెచ్చని నీటియందు కలుపుకుని తీసుకోవాలి .
* నేలవేము , శొంఠి , తిప్పతీగ కషాయం సేవించవలెను .
* యవలు , గోధుమలు , ఆవాలు వీనిని నూరి స్థనముల యందు పూసుకుని కొంచంసేపు ఉంచి కడుగుకొనవలెను. పాలను పిండవలెను.
స్తన్యము పిత్తము వలన దోషము పొందిన చేయవలసిన చికిత్సలు -
* పిత్తముచే స్తన్యము రంగు మారి దోషము పొంది ఉన్నచో యష్టిమధుకం , ద్రాక్షపండ్లు , క్షీర కాకోళి , వావిలి వీని యొక్క కల్కమును చల్లని నీటితో పుచ్చుకొనవలెను .
* ద్రాక్షపండ్లు , యష్టిమధుకం వీటిని నూరి ఆ కల్కము స్తనములకు పూసి కొంచంసేపు ఉంచి కడిగివేసి ఆ స్తన్యమును పిండవలెను.
* స్తన్యము దుర్గన్ధముగా ఉన్నచో త్రికటు చూర్ణం , కరక్కాయ చూర్ణం , తేనె కలిపి పుచ్చుకోవలెను . లవంగపత్రి , కురువేరు , చందనము , వట్టివేళ్లు కలిపి నూరి పైన చెప్పిన విధముగా స్థనములకు లేపనం చేయవలెను .
కఫము వలన స్తన్యము దోషము పొందినచో చేయవలసిన చికిత్సలు -
* కఫము వలన స్తన్యము దోషము పొంది జిడ్డుగా ఉన్నచో దేవదారు , తుంగగడ్డ , చిరుబొద్ది , సైన్ధవ లవణము వీటిని నూరి గోరువెచ్చని జలముతో పుచ్చుకొనవలెను. నేలగుమ్మడి , మారేడు , యష్టిమధుకం నూరి స్థనములకు లేపనం చేయవలెను .
పైన చెప్పిన మూలికలు అన్నియు ఆయుర్వేద పచారీషాపుల్లో దొరకును. ఇప్పుడు మీకు పాటించవలసిన ఆహారనియమాల గురించి వివరిస్తాను.
పాటించవలసిన ఆహారనియమాలు -
స్తన్యదోషము నందు చామలు , కొర్రలు , వెదురు ధాన్యము , పెసలు , శనగలు , ఉలవలు , వేప , చేదుపోట్ల , వంగ , ఉశిరికాయలు , త్రికటుకాలు , సైన్ధవ లవణం వాడవలెను .
సంపూర్ణం
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి