పంచాయతీ వార్డ్ మెంబెర్ కూడా
ఇన్నోవాలో తిరిగే ఈ దేశంలో..
ఎమ్యెల్యే అయితే చాలు
వందల కోట్లు సంపాదించే ఈ రోజుల్లో..
మునిసిపల్ వార్డ్ మెంబెర్ బామ్మర్ది కూడా
టొయోట ఫార్చ్యూన్ కార్లో తిరుగుతున్న ఈ రోజుల్లో..
నువ్వు సున్నా నుంచి 2000 కోట్లకి అని ఒకరంటే నువ్వు లక్ష కోట్లు తినేసిన నేరస్థుడివి అని ఒకరి ఆస్తుల లెక్కలు ఇంకొకరు బయటపెట్టే ఈ రోజుల్లో..
సీఎం కొడుకుగా 84 కోట్ల అడ్వాన్స్ ఆదాయపుపన్ను చెల్లించే ఈ రోజుల్లో..
సీఎం మనవడి పేరున కూడా వందల కోట్ల ఆస్తులు వుండే ఈ రోజుల్లో..
సొంత విలాసాలకు ప్రభుత్వ ధనం విచ్చలవిడిగా ఖర్చు చేసే నాయకులు ఉన్న ఈరోజుల్లో..
నెలకోసారి బ్యాంకాక్ యాత్రలకు వెళ్లి సేద తీరే నాయకులు ఉన్న ఈరోజుల్లో ..
సొంతగా ఒక కార్ ఒక ఇల్లు కూడా లేకుండా తల్లి కూడా ఆటోలో వెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించునే అంత సామాన్యంగా..
సొంత అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మా అన్న ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రెండు సార్లు అత్యధిక మెజారిటీతో ప్రధానిగా ఎన్నికైన నాయకుడు అన్న కించిత్ గర్వం లేకుండా అతి సామాన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు..
ఆయానకంటూ ఏమి లేని రాజర్షి..
మానవ సేవే మాధవ సేవ అని నమ్మే సత్యపదోన్నతుడు..
ప్రకృతి తయారు చేసుకున్న యోధుడు..
మన గర్వం
మన ప్రాణం..
మన భవిష్యత్తు..
మన గుండె ధైర్యం..
మన ప్రధాన మంత్రి.
20 ఏళ్ళు సీఎం పీఎం హోదాల్లో దేశంలో అత్యధిక కాలం ఆ హోదాల్లో ఉన్న నేత..
మరో విషయం మీకు చెప్పాలి. రేపటినుండి " శరవన్నవరాత్రులు" మొదలు. మన ప్రియాతి ప్రియమైన ప్రధాని ఈ పర్వదినాలలో నిమ్మరసం మాత్రం తాగి ఉపవాసం ఉంటారు.
ఆయన నిజమైన " రాజర్షి "
ఆయన ప్రధానిగా ఉన్న రోజులలో నేను జీవించి ఉండటం నా అదృష్టం అని భావిస్తున్నాను.
మీకు పాదాభివందనములు రాజర్షి !!
🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి