.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||
అగజాధీశ ! నినున్ జగజ్జననియౌ ఆర్యామహాదేవినిన్
నిగమమ్ముల్ నుతియించు నేర్పుమెఱయన్ నిత్యంబు స్తు త్యార్హులై
సుగతింగూర్చెడు నాది దంపతు లటంచున్; మోక్ష మిప్పింపవే
సిగపై క్రొన్నెలపూవుదాలుపు శివా ! శ్రీ సిద్ధలింగేశ్వరా !
భావం;
మేరు పర్వతాధీశ్వరుడైన శివా!
నిన్నూ, జగజ్జనని అయిన పార్వతీ మాతను ప్రార్థన చేస్తూ మీరే సద్గతులు ప్రసాదించే ఆది దంపతులని చెప్తూ నిత్యము మిమ్మల్ని కీర్తించే నాకు మోక్షం ప్రసాదించవా?
సిగలో చంద్ర వంకను ధరించిన ఓ చంద్రశేఖరా! శివా శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి