18, అక్టోబర్ 2020, ఆదివారం

 *ఆచార్య సద్భోదన*

🕉🌞🌎🌙🌟🚩


*పరమగమ్యాన్ని చేర్చే మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనస్సు కామలోభాలకు లొంగిపోయి ఆధ్యాత్మిక సాధకుడు దిగజారిపోయే ప్రమాదం నిరంతరం ఉంటుంది. ఎంతో పురోగతి సాధించిన వారికి తప్ప నిజమైన రక్షణ లభించదు.*


*ఆత్మసాక్షాత్కారం లభించే లోపల ఎంత గొప్ప భక్తుడైనా అధఃపతనం చెంది, వేదనలో మునిగిపోవచ్చు. కాబట్టి తగిన పురోగతి సాధించకుండా మన సామర్ధ్యం గురించి ఎక్కువగా అంచనా వేసుకుని సాహసాలు చేయకూడదు.*


*ఆధ్యాత్మిక సాధనను, ప్రార్థనలను ఉధృతం చేయాలి. రాత్రింబవళ్ళూ నిరంతర ప్రార్థన, నిరంతర ధ్యానం, గాఢమైన సద్విచారణ చేస్తే అపారమైన మంచి జరుగుతుంది.*


*సాధన ప్రారంభదశలో ఉన్నవారు తన మనస్సును భగవంతునికి సంబంధించిన ఆలోచనలతో నింపుతూ, వాటిని ఒక అలవాటుగా మార్చుకోవాలి.*


*ఒకసారి బలమైన అలవాట్లు ఏర్పడ్డాక మార్గం సుగమం అవుతుంది. అప్పుడు శ్రమ కొంత తగ్గుతుంది.*


*శుభంభూయాత్*


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: