*జయ జయ జగదంబ శివే*
*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*
*జయ జయ మహేశదయితే*
*జయ జయ చిద్గగన కౌముదీధారే||*
🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
🌷 మూకపంచశతి 🌷
🌷 ఆర్యాశతకము 🌷
🌹 7.
ఐశ్వర్య మిందుమౌలేః
రైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతమ్౹
ఐన్దవ కిశోర శేఖరం
మైదమ్పర్యం చకాస్తినిగమానామ్౹౹
🌺భావం:
ఐశ్వర్యము గలవాడే ఈశ్వరుడగును .ఈశ్వరుడు అనగా పాలించు ప్రభువు . అమ్మవారి కి శివుడు ప్రభువు. బ్రహ్మాండమే శరీరముగా కలిగిన అమ్మయే చంద్రశేఖరుని ఐశ్వర్యము. అమ్మవారి వలననే శంకరుని కి ఈశ్వరత్వము ప్రాప్తించినది.బ్రహ్మాండముపైభాగమున ఆకాశమున చంద్రుడుండును.ఆ ద్యులోకమే (నీలాకాశమే)అమ్మవారిశరీరముపైని శిరస్సు.ఆ ఆకాశశిరమున నెలబాలుడు( చంద్రరేఖ) అమ్మవారు అలంకరించుకున్న శిరోభూషణముగా శోభిల్లుతున్నాడు .అర్ధప్రపంచరూపమైన బ్రహ్మాండమంతయూ అమ్మవారయినట్లే శబ్ధప్రపంచమంతయూ అమ్మవారి స్వరూపమే! వాగ్రూపిణి అయిన అమ్మవారు దివ్య కాంచీ ధామమందు వేదముల తాత్పర్యముగా ,జీవైశ్వర్యైక జ్ఞాన హేతువు గా, బాలేందుమౌళి గా ప్రకాశించుచున్నది.
🙏మాయాతీతస్వరూపిణీ !నను బ్రోవవే త్రిపుర సుందరీ 🙏
🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱
🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹
సశేషం....
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి