1, నవంబర్ 2023, బుధవారం

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////      ***** అవధాన మధురిమలు ***** అష్టావధాని శ్రీ గరికపాటి మల్లావధాని *****               సమస్యాపూరణములు ;----1*"" మానిని మానుషం బెడలి మర్కట మౌనిదియేమి యీశ్వరా!"" ఉ.నేనను వస్తువీజగతి నిల్వ నుపాధి యొకండు కావలెన్ / దానికి ప్రోపు ప్రాపు వెలిదాపు ఘటింపగ గ్రాసవా / సో నిచయాదులక్కరగుజువ్వె, తదార్జనకై కడంగుచో / మానిని మానుషంబెడలి మర్కటమౌనిది యేమి యీశ్వరా!                            2*"" కరణంబును జూచి భూమికాంతుడు బెదరెన్.""    కం. పరిపూర్ణ బాహుసత్త్వులు / హరిపుత్రకు లొకరి కొక్కరందక పెలుచన్ / గిరులం బోరంగని భీ / కరణంబును జూచి భూమికాంతుడు బెదరెన్.       దత్తపది;--- " గాంధిః -- జేతుం -- ఈశః -- పాయాత్"" అను పదములతో " గాంధీజీ దీవెన" గా శ్లోకం.                   శ్లో!! గాంధీ ర్మహౌజసాం కంధిః                                   జేతాయేన యదార్జితుం         ఈహాంగ తోద్య సర్వేశః.         పాయాత్ప్రాపయ్యనః ప్రియాత్!                               వర్ణనలు;--- విమానము.        ఉ. మానిత యంత్రశక్తిని విమానము ద్యోతలమందు  నేగుచో / దానఁ గలట్టి వారలకు ధారుణి దిద్దిర దిర్గునట్లుగా / గానంగనౌను, భూధరనికాయము దోఁచును బొమ్మరాళ్ళ చం / దాన నదీనదంబులు గనంబడు ప్రాకెడు పాములో యనన్.                 2* స్త్రీ పురుష సామ్యమును గూర్చి పద్యము---                           సీ. కుచముల బరువుతోఁ గ్రుంగిన నడుముతో బటువులౌ తత నితంబములతోడ.                రాచిల్క నుడులతో రాయంచ నడలతో బెడఁగారు పెన్జలడతోడ.         చలదపాంగములతోఁ జారుహాసములతో కలితాతిమృదులాంగకములతోడ.                                  అదరుతో బెదరుతో నతిమాత్ర లజ్జతో బ్రత్యంగ భూషాప్రభాస తోడ                తే.గీ. నలరు నన్వర్థసంజ్ఞలౌ నబల లేడ? పూరుషులతోడ సామ్యంబుఁ బొందుటేడ?       నక్క చిరముగఁ బొరియలోన స్థపించి, సింహసామ్యంబు నెన్నఁడే న్జెందఁగలదె?                         ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                         తేది 1--11--2023, బుధవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: