1, నవంబర్ 2023, బుధవారం

పుణ్యఫలం

 పుణ్యఫలం అనుభవించడంతోపాటుగా ఎవరెవరు పాపాత్ముల వెనక చేరతారు? 

ఎవరైతే ధర్మద్రోహాన్ని ఖండించకుండా ఉంటారు? గ్రహించి, 

వాళ్లందరికీ కూడా పాప ఫలం పొందే అవకాశం ఇవ్వడమనేది భగవంతుని యొక్క ఉపేక్షకి ముఖ్య హేతువు. 

*ఉదాహరణకి* 

జరాసంధుడు అనేకమార్లు దండెత్తుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ జరా సంధుని మాత్రం సంహరించకుండా తప్పించుకునేవాడు ఎందుచేత అంటే... 

అనేకమార్లు జరాసంధుడు ధర్మద్రోహులు అందరిని తోడు వేసుకుని రావడం, వాళ్ళందరూ కూడా జరాసంధుడు వినా, శ్రీకృష్ణ చేత సంహరించబడడం జరుగుతూ ఉండడం వలన పాపాత్ములని పోగు చేసే డ్యూటీ జరాసంధునికి ఇచ్చినట్టు అయ్యింది. 

అదేవిధంగా అధర్మాత్ముడిని ఎవరెవరైతే ఖండించరో... 

వాళ్ళందరూ ఉపేక్ష వహించినవారుగా భగవంతుని దృష్టిలో శిక్షార్హులవుతారు. 

దీనికే భారతంలో 

సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే 

బారము పొందలేక చెడబారినదైన ..... 

అంటూ శ్రీకృష్ణ పరమాత్మ కౌరవసభలో చెప్పడం జరిగింది.

కామెంట్‌లు లేవు: