కన్యా దానం
ఆ సమయంలో పురోహితుడు ఏం చెబుతున్నాడో చూడండి.
ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి,
ధ్రువంత ఇంద్రాగ్నిశ్చ రాష్ట్రం ధారాయతాం ధ్రువం,
ధ్రువం ధ్రువేణ హవిశా తస్త్మ్ర దేవా అధిబ్రువన్,
అయంచ బ్రహ్మణ స్పతి
దాంపత్య సామ్రాజ్యాన్ని ధరించనున్న నీకు రాజైన వరుణుడు, దేవుడైన బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని, వేదమూర్తియైన బ్రాహ్మణుడు స్థిరమైన వారుగా నిశ్చయించబడ్డారు.
పై జాబితాలో అమ్మాయి ఐదుగురికి నిశ్చయించ బడింది. ఆ జాబితాలో అసలు కాబోయే పెళ్ళికొడుకు ప్రస్తావన ఏదీ? వివాహ ప్రకరణంలో ప్రధాన హోమం సమయంలో చెప్పే ఈ శ్లోకం ఏమిటి అంటే
సోమః ప్రధమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: !
తృతీయో అగ్ని స్టే పతి: తురీయస్తే మనుష్యజ: !!
పుట్టిన ప్రతి ఆడపిల్ల మీదా ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చేవరకూ చంద్రుడు రాజ్యంచేస్తాడట. అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయంగా ఉండడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూ వుంటారు కూడా. ఏ చంద్రుడు మనస్సుని దృఢం చేస్తుంటాడో ఆ కారణంగా తండ్రి, మామయ్య, బాబాయి …. ఇలా అందరినీ, ఇంటినీ, పొరుగింటినీ కూడా ఇట్టే ఆకర్షించ గలుగుతారు ఈ కాలంలో. ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకూ ఆ పిల్లని చంద్రసాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు. గంధర్వుడు లావణ్యానికి అధినేత కాబట్టి ఆ పిల్లకి అందాన్ని కలిగిస్తాడు. ఆడపిల్లలలో నిజమయిన అందం (ఏ విధమైన దుర్భావనకూ లేని అందం) ఆరు నుండి పదేళ్ళ వరకూ బాగా ఉంటుంది. ఇక 11 నుండి 15 యేళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగా స్వీకరిస్తాడు. అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామగుణాన్ని 11 వ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు.
అగ్నిర్వై కామకారకః –
శరీరంలో ఆమెకి అగ్నిని, కామగుణాన్ని ప్రవేశపెడతాడు. ఆకర్షణీయతని, మనస్సుని చంద్రుడు, లావణ్యాన్ని గంధర్వుడు ప్రవేశపెట్టాక, ఆమెలో కామగుణాన్ని అగ్ని ప్రవేశ పెడతాడు. 12-15 వయసుగల అమ్మాయిలు రజస్వ్వల కావడానికి కారణం ఇదే. ఇపుడామె వివాహానికి యోగ్యురాలు అయింది. అందుకనే వీరందరూ అంగీకరిస్తేనే పెళ్లి.
చంద్ర సాక్షిగా గంధర్వుడు, గంధర్వ సాక్షిగా అగ్ని, అగ్ని సాక్షిగా వరుడు ఈమెని గ్రహిస్తారు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం. వరుడు ఇంకా ఈమెని అగ్నిసాక్షిగా ధనాన్ని, పుత్రులను కూడా ఇచ్చాడు అని వరుడు అగ్నికి నమస్కరిస్తాడు. తనకి అభివృద్ధికి కాబోయే సంపద అంతా ఈమె ఇల్లాలుగా ఇంటి బాధ్యత చేపట్టాక వస్తుంది అని చెబుతుంది. అంటే మొదటి ఐదేళ్ళు చంద్రుడు అమ్మాయి బాధ్యత తీసుకుంటున్నాడు, తరువాత గంధర్వులు తీసుకుంటున్నారు, అటుపై అగ్ని దేవుని బాధ్యత అందుకే అగ్ని సాక్షిగా నీ వివాహం ఆయన తన బాధ్యత నీకు అప్పగిస్తున్నాడు. ఇది ఈ మంత్రార్థం. వీరి అందరికీ దంపతులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధాన హోమం చేస్తారు.
వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు.
నిశ్చితార్ధంలో చెప్పినా ఇక్కడ బ్రహ్మముడి వేసి చెప్పినా
‘ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి:
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ ….
అని దీవిస్తారు. అంటే దాంపత్యసామ్రాజ్యాన్ని అనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి.
వీళ్ళ దాంపత్యం నిత్యనూతనంగా నిశ్చలంగా ఆనందమయంగా ఎప్పటికీ కలిసి ఉండాలని దేవతల అండగా ఉండాలని దీవిస్తారు. ప్రతీ దానికీ ఎంతో అందమైన అంతరార్థం వుంటుంది, సనాతనధర్మంలో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి