1, నవంబర్ 2023, బుధవారం

మనస్సుకి చాంచల్య స్థితి

 శ్లోకం:☝️

*స యథా శకునిస్సూత్రేణ*

   *ప్రబద్ధో దిశన్దిశమ్పతి-*

*త్వాన్యత్రాయతనమలబ్ధ్వా*

   *బన్ధనమేవోపశ్రయతే l*

 _ఏవమేవ ఖలు సోమ్య!_

   *తన్మనో దిశన్దిశమ్పతి-*

*త్వాన్యత్రాయతనమలబ్ధ్వా*

   *ప్రాణమేవోపశ్రయతే హి*

*ప్రాణబన్ధనం మన ఇతి l*

    - చాందోగ్యోపనిషత్తు


భావం: ఎలా అయితే త్రాటితో కట్టబడ్డ పక్షి ఎక్కడ తిరిగినా తగిన ఆశ్రయం లభించక తిరిగి పంజరానికే వచ్చి చేరుతుందో, ఓ సౌమ్యా! అదే విధంగా మనస్సు కూడా ఈ శరీరంలో ప్రాణంతో బంధింపబడి ఉండడం వల్ల ఎక్కడకు వెళ్లినా తగిన ఆశ్రయం లభించక తిరిగి తిరిగి ప్రాణాన్నే ఆశ్రయిస్తోంది. మనస్సుకి చాంచల్య స్థితి తప్పేది ప్రాణంలో లీనం కావడం వల్లనే.🙏

కామెంట్‌లు లేవు: