చమత్కార శ్లోకం
ప్రభాతే కీదృశంవ్యోమ
ప్రమాణే కీదృశం వచః
ఆంధ్ర గీర్వాణ భాషాభ్యాం
ఏకమేవోత్తరం వద
ఉదయం ఆకాశం ఎలా ఉంటుంది?
ప్రమాణం చేసేటప్పుడు ఏ పదం ఉపయోగిస్తారు?
ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఒకే పదమై ఉండాలి , అది అటు ఆంధ్ర(తెలుగు) భాషా మరియూ ఇటు సంస్కృత భాషా అయ్యుండాలి
సంస్కృతం లో లింగ, వచన, విభక్తి ఇత్యాది దోషాలు ఉండకూడదు
ఎలా?
జవాబు
“నీతోడు”
ప్రమాణం చేసేప్పుడు “నీతోడు” అని అనడం తెలుగు భాషలో ఉంది
సంస్కృతంలో నీత+ఉడు=నీతోడు
అంటే తొలగిపోయిన నక్షత్రాలు కలది(“ఉడు”=నక్షత్రం)
ఉదయం నక్షత్రాలు లేకుండా ఉన్నది ఆకాశం
(నీతోడు వ్యోమ-రెండూ నపుంసక లింగాలే,లింగ విభక్తి వచన దోషాలు లేవు , విశేషణ విశేష్యాలు👍🏻)
ఇలా జవాబు కుదిరింది .
ప్రభాతే వ్యోమ నీతోడు
ప్రమాణే వచః
ఆంధ్ర భాషలో “నీతోడు”
😃
ఉడు = నక్షత్రం
ఉడుపః=చంద్రుడు(తాటంకయుగలీభూత తపనోడుప మండలా)
ఉడుభృత్= చంద్రుడు
ఉడుభృన్మౌలిః=శివుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి