2, జూన్ 2024, ఆదివారం

02.06.2024. ఆదివారం

 02.06.2024. ఆదివారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష *ఏకాదశి* తిథి రా.02.41 వరకూ తదుపరి *ద్వాదశీ* తిథి, *రేవతి* నక్షత్రం రా.01.40 వరకూ తదుపరి *అశ్వని* నక్షత్రం, *ఆయుష్మాణ* యోగం మ.12.12 వరకూ తదుపరి *సౌభాగ్య* యోగం , *బవ* కారణం మ.03.53 వరకూ,*బాలవ* కరణం రా.02.41 వరకూ తదుపరి *కౌలవ* కరణం ఉంటాయి.

*సూర్య రాశి*: వృషభ రాశి లో (రోహిణి నక్షత్రం లో)

*చంద్ర రాశి*: మీన రాశిలో రా.01.40 వరకూ తదుపరి మేష రాశిలో 

*నక్షత్ర వర్జ్యం*: మ.02.28 నుండి మ.03.58 వరకూ

*అమృత కాలం*: రా.11.26 నుండి రా.12.55 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.41

*సూర్యాస్తమయం*: సా.06.48

*చంద్రోదయం*: రా.02.46

*చంద్రాస్తమయం*: మ.02.45

*అభిజిత్ ముహూర్తం*: ప.11.48 నుండి మ.12.41 వరకూ

*దుర్ముహూర్తం*: సా.05.03 నుండి సా.05.55 వరకూ.

*రాహు కాలం*: ఉ.05.09 నుండి ఉ.06.48 వరకూ

*గుళిక కాలం*: మ.03.31 నుండి సా.05.09 వరకూ

*యమగండం*: మ.12.14 నుండి మ.01.53 వరకూ.


ఈ రోజు *అపర ఏకాదశి*.వైశాఖ బహుళ పక్ష ఏకాదశి ని అపర ఏకాదశి అని పిలుస్తారు. *అపర* అనే సంస్కృత పదానికి అర్ధం అనంతమైన,పరిధి లేనిది అని. ఈ రోజు విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే,అనంతమైన సుఖ సంతోషాలు,సంపదలు కలుగుతాయి అని నమ్మకం. ఈ ఏకాదశి ని *అచల ఏకాదశి* అని కూడా పిలుస్తారు. వాయువ్య భారత దేశంలో,ఈ ఏకాదశి ని *భద్రకాళీ ఏకాదశీ* గా జరుపుకుంటారు. ఈ రోజు భద్రకాళీ అమ్మవారిని పూజించడం వలన శుభాలు కలుగుతాయని అక్కడి భక్తుల నమ్మకం. ఒరిస్సా రాష్ట్రం లో *జలక్రీడా ఏకాదశి* గా ఈ రోజు జగన్నాథ స్వామి కి ప్రత్యేక పూజలు చేసి జరుపుకుంటారు. భాగవత పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు గోపికలతో జలక్రీడలు ఆడిన రోజు ఈ ఏకాదశి అని,అందుకని *జలక్రీడా ఏకాదశీ* అని పేరు వచ్చినది అని కథనం. ఈ రోజంతా భక్తులు ఉపవాసం ఉండి, విష్ణుమూర్తి ని తులసీ దళాలతో,విష్ణు సహస్ర నామాలతో పూజించి,వైష్ణవ దేవాలయ సందర్శనం చేయడం వలన శుభాలు కలుగుతాయని నమ్మకం.ఈ రోజు ఏకాదశీ ఉపవాసం ఉన్నవారికి, *పారణ సమయం* రేపు 08.05 నుండి ఉదయం 08.18 వరకూ ఉంటుంది. ద్వాదశీ హరివాసరం రేపు ఉ.08.05 వరకూ ఉంటుంది.


ఆదివారం, అశ్వని నక్షత్రము కలయిక ఉండడం వలన, *సర్వార్థ సిద్ధి యోగం* ఈరోజు రా.01.40 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


నారాయణ స్మరణ తో..సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నంబర్:6281604881.

కామెంట్‌లు లేవు: