2, జూన్ 2024, ఆదివారం

ఒకపని మొదలు పెట్టినప్పుడు

 *2026*

*కం*

ఒకపని మొదలిడి నప్పుడు

సకలంబుల విస్మరించి సాగెడి వాడే

సకలంబులు జేయగలుగు

ఒకేఒకడుగా నెగడును ఉర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఒకపని మొదలు పెట్టినప్పుడు (ఎంతగొప్పవైననూ) తక్కిన పనులన్నీ విడిచిపెట్టి ముందు కు నడవగలిగేవాడే ఈ భూలోకంలో అన్ని పనులనూ చేయగలిగే ఒకేఒక్కడుగా వర్థిల్లును.

*సందేశం మరియు సందర్భం*:-- ఈనాడు ఒకపనికోసం స్మార్ట్ ఫోన్ తీయగా నే ఎన్నో అనవసరమైన సమాచారాలు కనబడి కలత(disturbance)పెడతాయి. అటువంటప్పుడు ఈ పద్యం గుర్తుకు తెచ్చుకుని తక్కినవన్నీ విడిచిపెట్టగలిగినవాడే సర్వ సమర్థుడగును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: