28, సెప్టెంబర్ 2023, గురువారం

కొండల నుందువో

 ఉ॥

కొండల నుందువో! లలితకోమలడెందము లందు నుందువో!

బండల నుందువో! మృదులభావరసోన్నతులందు నుందువో! 

చండపరాక్రమోద్ధతికి శాత్రవదర్పనిహంతృబుద్ధికిన్ 

మండితరూపమైన నిను మాన్యత గొల్తును తల్లి! శాంభవీ! 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: