&&& నాలుగు మంచి మాటలు &&& ***** సుఖాలను పొందినందుకు మనం కృతజ్ఞులుగా ఉండడం అవసరం అనుకొంటే - - - - - దుఃఖాలు పొందనందుకు కూడా మనం కృతజ్ఞతతో ఉండవచ్చుగదా! ఆలోచించండి! ***** మనం పొందిన కష్టాలను ఇసుకలో రాసుకోవాలి. మరి సుఖాలనో రాతిపై చెక్కించుకోవాలి. కృతజ్ఞత చూపగలిగినవారికి అవి రెట్టింపుగ లభిస్తాయి. ***** చెడులో మంచిని చూడటం, విషాదంలో కూడా సంతోషాన్ని చూడడం,కష్టాలలో కూడా లాభాన్ని గణించడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో మనం ఒకరిగా ఎందుకు ఉండకూడదు. ***** చేసిన ఉపకారాన్ని మరవడం - - - అజ్ఞత. ఉపకారికి ఉపకారం చెయ్యడం - - - విజ్ఞత. ఉపకారికి అపకారం తలపెట్టడం - - - కృతఘ్నత. అపకారికి ఉపకారం చెయ్యడం - - - ధన్యత. ***** ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ***** పట్టుదలతో సంపాదించుకోవలసింది- - - కీర్తి. సంరక్షించుకోవల్సిందా? గౌరవం. ***** కొండ పాదపీఠం వద్ద కంటే కొండ శిఖరాగ్రాన జాగ్రత్త మిక్కిలి అవసరం. కింద పడితే చిన్నపాటి దెబ్బలతో లేచి నిలబడవచ్చు. కొండ పై భాగాన్నుండి పడితే శాల్తీ గల్లంతు కావచ్చు. ***** ఒకరికి సలహా ఇచ్చేటప్పుడు విచక్షణ అవసరం--- ఒకరినుండి సలహా స్వీకరించేటప్పుడు వినమ్రత అవసరం. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - Sharpen your mind! 1* I am alive without breath and cold as death. I am never thirsty but always drinking. What am I? 2* In the face of adversity , I rise above, inspiring generations with courage and love. I transcend borders, cultures, and creed , embracing diversity, fulfilling a greater need. What am I? 3* I am bright as gold, but without a touch ,I turn cold. What am I? 4* I have a heart that doesn't beat. I have no home but I never sleep. I can take a man's house and build another's. What am I? (For answers you have to wait 24 hrs only.). * * * * * * * * * * * * * * * * * * * * * * * తెలుగు పొడుపుకథలు ( విడుపులు) 1* ఒక రాజుకు పన్నెండు చొక్కాలు. నెల తిరగగానే చొక్కాను మారుస్తారు. ఏమిటది? ( కాలెండర్) 2* హద్దు లేని పద్దు. ఎన్నడూ ఆడొద్దు.? (అబద్ధం) 3* హద్దులోనే ఉండాలి. " రామాయణం లో ఒక వాడుక పదం. ( లక్ష్మణరేఖ) 4* ఊళ్ళో పెళ్ళి. ఇతడికే హడావుడి? ( వీధి కుక్క) 5* హారం కాని హారమిది? (ఆహారం) తేది 28--9--2023, గురువారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి