*మహాభారతములో - ఆది పర్వము*
*ప్రథమాశ్వాసము*
*8*
*తక్షకుని మీద ఉదంకుని ప్రతీకారం*
అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందు కొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు. " జనమేజయ మహారాజా ! నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను గురువు గారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేసాడు. నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేసాడు. శృంగి శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు మహారాజును అతి క్రూరంగా కాటు వేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు. మహా బలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా చంపాడు కదా ! నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా ! ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసి నట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి " అని జనమేజయుని రెచ్చకొట్టాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి