28, సెప్టెంబర్ 2023, గురువారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 50*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 50*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*శ్రీ రామకృష్ణులు అవతార పురుషులా?*


శ్రీరామకృష్ణులు సైతం పలువురిని, "నా

 గురించి నువ్వు ఏమనుకొంటున్నావు?” అని అడగడం కద్దు. భక్తశ్రేష్ఠుడు, సాటిలేని జ్ఞాని, గొప్ప మహాత్ముడు, రాధాదేవి అవతారం, చైతన్య మహాప్రభు అవతారం, సాక్షాత్తు భగవంతుడే మానవరూపం దాల్చి అరుదెంచిన అవతారం అంటూ విభిన్న భక్తుల నుండి వివిధ జవాబులు వచ్చేవి. వచ్చే జవాబు నుండి ప్రతి ఒక్కరి మనఃస్థితిని శ్రీరామకృష్ణులు గ్రహించే వారు. తమ శిష్యుల మానసిక స్థితిని పరీక్షించే కొన్ని మార్గాలలో ఇదీ ఒకటి. 

 

నరేంద్రుణ్ణి కూడా ఆయన ఇదే ప్రశ్న అడిగినప్పుడు, "వేయిమంది మిమ్మల్ని భగవదవతారంగా పేర్కొనవచ్చు. కానీ నాకు రూఢిగా నమ్మకం కలిగేంత వర నేను దానిని స్వీకరించలేను" అని అతడు జవాబిచ్చాడు. అలవాటు ప్రకారం శ్రీరామకృష్ణులు నవ్వేసి మౌనం వహించారు.


ఈ విషయంగా ఒకసారి భక్తుల మధ్య చర్చ జరుగుతున్నప్పుడు నరేంద్రుడు, "భగవంతుని లాంటి వ్యక్తిగా నేను ఆయనను పరిగణిస్తున్నాను. స్థావరానికీ (చెట్లు) మృగానికీ మధ్య సృజింపబడింది ఒకటి ఉంది. ఆ ప్రాణి స్థావరమా, మృగమా అని రూఢిగా చెప్పలేం. అట్లే మనిషికీ దేవునికీ మధ్య ఒక దశ ఉంది. ఆ దశలో ఉన్న వ్యక్తి భగవంతుడా, మనిషా చెప్పడం కష్టం. అలాంటి దశలో శ్రీరామకృష్ణులు ఉన్నారు" అని చెప్పాడు. 


డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆ అభి ప్రాయాన్ని ఖండిస్తూ, "భగవంతుని గురించి విషయాలను ఉదాహరణలు చూపి విపులీకరించలేం" అన్నాడు. అందుకు నరేంద్రుడు, “ఆయనను నేను భగవంతుడని పేర్కొనడం లేదు; మనిషిగానే పరిగణిస్తున్నాను" అన్నాడు. శ్రీరామకృష్ణులతో సన్నిహితంగా మెలగేకొద్దీ నరేంద్రుని దేవుని- భావన క్రమంగా మారిపోసాగింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: