9, అక్టోబర్ 2020, శుక్రవారం

జాతక రీత్యా

 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘


      _*👌*మీరు గమనిస్తే రెప్పపాటు కాలంలో అంటే ఒక్క క్షణంలో కనీసం నలుగురైనా ఈ భూమిపైన మనుషులుగా జన్మిస్తూ ఉంటారు. మరి ఒకే సమయంలో పుట్టిన వారందరూ జాతక రీత్యా ఒకే రకమైన జీవితం గడపాలి కదా? కానీ అలా జరగడం లేదే, మరి అందుకు కారణం ఏమిటో ఒకసారి పరిశీలిద్దామా..*_👌


      _**ఇదే విషయాన్ని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. జాతకం రిత్యా ఒకేసారి జన్మించిన వ్యక్తులు ఒకరు ఉచ్చ స్థితిలో ఉన్నారు, మరొకరేమో నీచ స్థితిలో ఉన్నారు. మరి దీనికి కారణాన్ని మీకు తెలియజేయడానికి మీకు ఒక కథనాన్ని అందిస్తున్నాను. దాన్ని పరిశీలించి మీరు జవాబును పొందవచ్చు. మగద సామ్రాజ్యానికి రారాజు మదన కామరాజు గారు. వారి జన్మదినం సందర్భంగా రాజ్యంలోని ప్రజలంతా వైభవంగా రాజుగారి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆరోజు రాత్రి పడుకున్న రాజుగారికి తన ఇంతటి వైభవవంతమైన జీవితానికి కారణమైన తన జాతకాన్ని తీసి ఒకసారి చూడాలని అనిపించింది.*_


     _**అలా తన జాతకాన్ని తీసి చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. నేను పుట్టిన రోజే ప్రపంచంలో అనేకమంది పుట్టివుంటారు కదా. కానీ వాళ్ళంతా నాలాగే రాజులు కాలేదు, మరి నేను మాత్రమే రాజును ఎందుకయ్యాను? ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలని మరుసటిరోజు సభలో పండితులను ఇదే ప్రశ్న అడుగగా వాళ్ళు చెప్పిన సమాధానాలు రాజుకు తృప్తిని ఇవ్వలేదు. అంతలో ఒక వృద్ధ పండితుడు రాజా, ఈ నగరానికి తూర్పున వున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు, ఆయనను వెళ్ళి కలవండి. మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అన్నాడు.*_


     _**రాజు ఆ సన్యాసిని కలవడానికి అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. అది చూసి రాజు ఆశ్చర్య పోయినా, తన ప్రశ్నకు సమాధానం ఏమిటని అడుగగా ఆయన అన్నాడు ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఇలాంటిదే మరొక గుడిశె వుంటుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు, వెళ్ళి ఆయన్ను కలవండి మీకు సమాధానం దొరుకుతుంది అన్నాడు. అసహనంగానే రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. రాజు ఆయన్ని కలిసినపుడు, ఆ సమయంలో ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు ఆశ్చర్య పోయాడు, కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.*_


    _**కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు. అందుకు రాజుకు కోపం వచ్చినా, సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. వెనుదిరిగిన రాజుతో సన్యాసి మళ్ళీ ఇలా అన్నాడు ఇదే దారిలో ఇంకొంచెం ముందుకు వెళితే ఒక గ్రామం వస్తుంది. అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి మీకు సరైన సమాధానం దొరుకుతుంది అన్నాడు. ఇదంతా రాజుకు గందరగోళంగా అనిపించినా ముందుకు వెళ్ళి చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. అపుడు ఆ అబ్బాయి చెప్పాడు, గత జన్మలో నలుగురు బాటసారులు అడవిలో ప్రయాణిస్తూ వున్నారు.*_


     _**ఆకలి వేయడం వల్ల ఆ నలుగురు ఒక చెట్టుక్రిందకు చేరి తమవెంట తెచ్చుకొన్న తమ ఆహారాన్ని తినే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతలో అక్కడికి బాగా ఆకలితో నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి బాగా ఆకలిగా ఉంది నాయనా ! నాకూ కొంచెం ఆహారం ఇవ్వండి అని అడిగితే ఆ నలుగురిలో మొదటవాడు కోపంతో పోపో నేను తెచ్చుకొన్నది నీకు ఇస్తే ఇంక నేను బొగ్గులు తినాలా అంటూ కసురుకొన్నాడు. రెండవ వ్యక్తిని అడిగితే.. నేను తినాల్సినది నీకు ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని కోపంగా అన్నాడు. ఇక మూడవ వాడు ఏం ఈ పూట తినకపోతే ఈ రాత్రికే నీవేమైనా చస్తావా? అని మానవత్వం లేకుండా మాట్లాడాడు.*_ 


     _**కానీ నాల్గవవాడు మాత్రం చూడు తాతా, నీవు చాలా నీరసంగా వున్నావు, నేను తెచ్చుకున్న ఆహారాన్ని నీకు ఇచ్చేస్తాను, ఈ పూట తినకపోతే నాకేమీ కాదులే అంటూ తన ఆహారాన్ని మొత్తంగా ఆ ముసలాయనకు ఇచ్చేశాడు. అలా ఇచ్చేసిన ఆ నాల్గవ వ్యక్తివి ఎవరోకాదు నువ్వే. అలా ఆకలి గొన్న వారికి నీ ఆహారాన్ని ఇచ్చిన ఆ పుణ్యఫలం వలన ఈ జన్మలో నీవు రాజువు అయ్యావు అని అన్నాడు. రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. చూడు రాజా అవసరంలో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వల్ల మహా పుణ్యాన్ని పొందుతారు. అలాంటి పనిని నీవు చేయడం వల్ల నీవు ఈ జన్మలో రాజుగా జన్మించావు.*_


     _**ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండికూడా అలా సహాయం చేయని వారు ఇదిగో మాలాగా అధోగతి పాలౌతారు. అందుకే మేము ఇలా నీచమైన జన్మను పొంది కష్టాలను అనుభ విస్తున్నాము. నీవేమో మహారాజువి అయ్యావు. కానీ నీవు, నేను రాజును నా దగ్గర ధనముంది అన్న అహంకారంతో ప్రవర్తిస్తూ ఇతరులకు సహాయం చేయకుండా, ఇతరులను నష్టపరచడం, కష్టపరచడం, బాధపెట్టడం వంటి పనులు చేస్తే నీవు కూడా మట్టిగొట్టుకు పోతావు. జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. అనవసరమైన విషయాలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె ఆదరించి పాలించు అని చెప్పి కన్ను మూశాడు..*_


           _**కాబట్టి మిత్రులారా ! చిన్నతనంలో జాతకాలు భేషుగ్గా బావున్నాయని మురిసి పోకండి. ఇక్కడ నీ జాతకాన్ని కూడా మార్చగల శక్తి నువ్వు చేసే కర్మలకు ఉంది. అది నీవు చేసే కర్మల పైన ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే ఉత్తముడిగా తయారై పుణ్యాన్ని మూటగట్టు కొంటావు. అలాకాకుండా ఇతరులను నష్టపరిచి కష్టపెట్టే చెడుపనులు చేస్తే నీచుడుగా తయారై పాపాన్ని మూటగట్టు కొంటావు. కాబట్టి అందరూ కూడా ఇతరులకు మీ చేతనైన సహాయం తప్పకుండా చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకొని పుణ్యాత్ములుగా జీవిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_👌


_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘


       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌


       _**For Every Action Equal &*_   

             _*Opposite Reaction**_

కామెంట్‌లు లేవు: