ఇక్కడ- అక్కడ
ఇక్కడ మనం ఉదయం నిద్రలేచిన దగ్గరనుండి మరలా రాత్రి నిద్రపోయేవరకు ఇక్కడే (బౌతికంగా) ఉంటున్నాము. కానీ నిజానికి మనం పూర్తిగా ఇక్కడే వుంటూ(మానసికంగా) అక్కడి విషయం అస్సలు ఆలోచించటం లేదు. ఎందుకంటె నీకు అన్ని ఇక్కడే కనపడుతున్నాయి. నీ ఇల్లు, నీ తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, బంధువులు, స్నేహితులు, విరోధులు, సంపదలు, ప్రేమలు, సాధింపులు, మమకారాలు, ద్వేషాలు, కోపాలు తాపాలు, సుఖదుక్ఖాలు,రాగద్వేషాలు, సంపాదనా ఖర్చులు, ఇవ్వన్నీ నీ చుట్టూ వున్నాయి అంతేకాక నేను నా గొప్పతనం, నా ఐశ్వర్యం, నా పేరు ప్రేతిష్ఠలు, నా గౌరవం అనేవి నిన్ను పూర్తిగా వశం చేసుకున్నాయి. నీవు ఏ పని చేసిన అది కేవలం అంటే కేవలం నీ కోసం లేక నీ వాళ్ళు అని నీవు అనుకునే వాళ్ళకోసం మాత్రమే. కాదు అని నీవు అనగలవా. అంటే అనలేవు ఎందుకంటె అది నీకు కనపడుతున్న సత్యం. అదే నీవు అనుకుంటున్న సత్యం.
మరి అక్కడ అక్కడ నీవు మాత్రమే వున్నాను అదికూడా నీవు అనుకునే నీవు కాదు ఆ నీవు ఎవరో అది నీకు తెలుసో లేదో కూడా నీకు తెలియదు. అంతే కాదు అక్కడ ఏమి వున్నదో కూడా నీకు తెలియదు అంతా శున్యం ఆ శున్యం ఒక పెద్ద అగాధంలా కనపడుతుంది అది నీకు అట్లా కూడా కనపడుతుందో లేదో తెలియదు ఎందు కంటే నీవు అక్కడి గూర్చి తెలుసుకోవాలని అనుకున్నావో లేదో తెలియదు ఇక్కడ వున్న వాళ్లంతా అక్కడికి చేరాల్సిన వాళ్ళే కానీ అందరు ఇక్కడే అన్ని ఉన్నాయని అక్కడి విషయాలు మరచారు. కొందరు పూర్తిగా అక్కడ వున్న దన్నది తెల్వకుండా వున్నారు.
ఇది ఇలా ఉంటే కొంతమంది మేము అక్కడే నిత్యం ఉంటామని నిన్ను కూడా అక్కడికి తీసుకొని వెళతామని అంటూవుంటాం. ఇది ఇక్కడ మనం రోజు చూస్తున్నాము. మరి నిజంగా వాళ్ళు అక్కడి గూర్చి తెలుసుకున్నవారా లేదా అది నీకు తెలియదు కానీ నీవు తెలుసుకోవచ్చు. అట్లా చెప్పే వాడు నీ నుంచి ఏ ప్రతిఫలం ఆశిస్తున్నాడు అన్నది నీవు గమనించు వాడు కేవలం ఒక రూపాయి నీ నుంచి ఆశించిన వాడు పూర్తిగా ఇక్కడి వాడే కానీ అక్కడి వాడు కాడు. వాడికన్నా నీకే అక్కడి గూర్చి తెలుసు అని తెలుసుకో
ముముక్షువులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి